డ్రెస్సుతోనే చంపేసింది.. స్నేహ బర్త్ డే పిక్స్ వైరల్.. క్యూటీ అంటూ శ్రీమతిపై ప్రేమ కురిపించిన బన్నీ
అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా టోటల్ సౌత్ ఇండియాలోనే ఫేమస్. స్టైలీష్ స్టార్ స్టేటస్‌కు తగ్గట్టు అల్లు స్నేహా కూడా అదే రేంజ్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బన్నీ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అల్లు పిల్లల అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బంధిస్తూ అభిమానుల ముందు ఉంచుతుంది. పిల్లలతో కలిసి బన్నీ చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు.

సెటైర్లు సైతం..
అల్లు అర్జున్, అల్లు స్నేహల మధ్య ఉన్న అన్యోన్యత గురించి అందరికీ తెలిసింది. ఈ ఫ్యామిలీ బయట కనిపించిందంటే చాలు అది ఆరోజు సెన్సేషనల్ అవ్వాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అల్లు స్నేహా వేసే సెటైర్లు అందరికీ తెలిసిందే. ఆ మధ్య అర్హతో పెళ్లి విషయంలో ఓ దారిలోకి తీసుకొచ్చేందుకు బన్నీ తంటాలు పడుతుండగా.. నువ్ మాత్రం మీ నాన్న చెప్పిన అమ్మాయినే పెల్లి చేసుకున్నావా? అంటూ బన్నీకే సెటైర్ వేసింది.

జంటగా వెళ్తే అంతే..
బన్నీ జంటగా ఎక్కడికైనా వెళ్లాడా? అంటే అక్కడ రచ్చ రచ్చ అవ్వాల్సిందే. గత నెలలో నిహారిక నిశ్చితార్థపు వేడుకల్లో వీరిద్దరే ఎక్కువగా హైలెట్ అయ్యారు. కొత్తజంటలా వీరు వచ్చిన తీరు. ఆ చేతిని పట్టుకుని అలా వస్తున్నప్పుడు దిగిన ఫోటోలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. అలా బన్నీ జంటకు ఉండే క్రేజే వేరు.

శ్రీమతికి స్పెషల్ విషెస్..
అల్లు స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ స్పెషల్ విషెస్ అందించాడు. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీతో ఇలా ఇంకా ఎన్నెన్నో బర్త్ డేలు జరుపుకోవాలని, ఇలా గడపాలని ఉంది.. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ శ్రీమతిపై ఉన్న ప్రేమను బన్నీ చూపించాడు.
Recommended Video

బర్త్ డే డ్రెస్ వైరల్..
మామూలుగా అల్లు స్నేహా చాలా సందర్భాల్లో సంప్రదాయ బద్దంగానే కనిపిస్తోంది. ఇంట్లో జరిగే పండుగలు, వేడుకలకు చీరల్లో కనిపిస్తుంది. కానీ ప్రైవేట్ పార్టీలు, ఇలా బర్త్ డే పార్టీల్లో మాత్రం ఓ రేంజ్‌లో దుమ్ములేపుతుంది.తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్, ఆ జంట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











