Allu Arjun దగ్గరున్న అతి విలాసవంతమైన 5 వాహనాలు.. వాటి ఖరీదు ఎంతంటే?
మెగా కాంపౌండ్ నుంచి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా సత్తా చాటాడు అల్లు అర్జున్. చిరంజీవి విజేత, కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమాలతో బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బన్నీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన గంగోత్రి మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. తర్వాత ఆర్యతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.
త్వరలో పుష్ప 2 సినిమాతో మరోసారి గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అతని వద్ద ఉన్న అత్యంత విలాసవంతమైన వాహనాలు, వాటి ఖరీదు ఓసారి తెలుసుకుందాం.

వంద కోట్ల పారితోషికం: ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. సుమారు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకునే నటుల జాబితాలో పుష్ప 2 ద్వారా ఆయన చేరినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది.
42వ వసంతంలోకి: ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ దుస్తుల నుంచి ప్రయాణించే వాహనాల వరకు చాలా ఖరీదైనవి వాడతారు. ఏప్రిల్ 8న బర్త్ డే జరుపుకుంటున్న బన్నీ 41 ఏళ్లు పూర్తి చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ దగ్గర ఉన్న 5 అత్యంత ఖరీదైన వాహనాలు ఏంటో చూద్దాం.

వానిటీ వ్యాన్: బన్నీకి చెందిన అత్యంత విలాసవంతమైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. బ్లాక్ కలర్ ను ఇష్టపడే అల్లు అర్జున్ ఈ వ్యాన్ ను కూడా అదే రంగులో తయారు చేయించుకున్నారు. ఈ వాహనంలో టీవీ, ఫ్రిజ్ తోపాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ తో తయారు చేయబడింది. షూటింగ్ సమయాల్లో ఇందులోనే బన్నీ సేద తీరుతారు. దీని విలువ సుమారు రూ. 7 కోట్లు. ఈ వ్యాన్ కు ఫాల్కన్ అని పేరు పెట్టారు. వాహనం బయట AA అని అక్షరాలు ఉంటాయి.
హమ్మర్ H2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కార్లంటే చాలా ఇష్టం. వాటిలో లాంగ్ డ్రైవ్ లకు వెళ్లడం అంటే మహా సరదా. అందుకే ఇలా లాంగ్ డ్రైవ్ కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ కార్లలో ఒకటైన హమ్మర్ H2ను కొనుగోలు చేశాడు బన్నీ. దీని ఖరీదు దాదాపుగా రూ. 75 లక్షలకు పైగా ఉంటుంది.

రేంజ్ రోవర్: అల్లు అర్జున్ గ్యారేజీలో కార్లు, బైక్ లు ఎక్కువగానే ఉంటాయి. అందులో భారీ ధర చేసే రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. 2019సో అందమైన ఈ రేంజ్ రోవర్ వోగ్ కారును అల్లు అర్జున్ కొన్నాడు. దీనికి బీస్ట్ అని పేరు కూడా పెట్టాడు. ఈ కారుకు ధర రూ. 1.8 నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.
జాగ్వార్ XJL: పుష్ప మూవీ ద్వారా ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కు స్పోర్ట్స్ కార్లు అన్న కూడా అమితమైన ఇష్టం. ఇక బన్నీ గ్యారేజీలో జాగ్వార్ XJL కారు కూడా ఉంది. దీని ఖరీదు సుమారు రూ. 1.2 కోట్లు. ఇదే కాకుండా మరికొన్ని కార్లు ఉన్నాయి. వాటిలో వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, BMW X6 M వంటి స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి.

ప్రైవేట్ జెట్: అల్లు అర్జున్ కు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ప్రస్తుతం దీని ఖరీదు తెలియదు కానీ, కుటుంబంతో కలిసి ఇందులోనే హాలీడేకు వెళతారు. అల్లు అర్జున్, ఆయన సతీమణి అల్లు స్నేహ రెడ్డి ఈ ప్రైవేట్ జెట్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో బన్నీ షేర్ చేశారు. ఇలా ప్రైవేట్ జెట్ లు కలిగి ఉన్న స్టార్ హీరోల్లో బన్నీ కూడా ఒకరు.
బన్ని నికర ఆస్తి: అల్లు అర్జున్ హైదరాబాద్ లోని నైట్ క్లబ్ ను రన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆధారిత కాల్ హెల్త్ సర్వీసెస్ నే హెల్త్ కేర్ స్టార్టప్ లో పెట్టుబడి పెట్టారు. అల్లు అరవింద్ తో కలిసి ఆహా ఓటీటీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక కుమార్తె పేరుతో అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ రూ. 350 కోట్లుగా సమాచారం. ఇంకా పలు భవనాలు, ఫ్లాట్స్ తదితర ఆస్తులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











