నా స్వీట్‌హార్ట్ ఇచ్చిందన్న అల్లు అర్జున్.. వెంటనే రియాక్ట్ అయిన రాశీ ఖన్నా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కేవలం వెండితెర పైనే కాదు, రియల్ లైఫ్‌లోను యమ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమా షూటింగ్ లలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా భార్యపిల్లలతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు బన్నీ. ఇక ఆయన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ అంటే బన్నీకి ప్రాణం. అందుకే తన పిల్లలతో గడిపిన విలువైన క్షణాలను ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కూతురు అల్లు అర్హ ఇచ్చిన గిఫ్ట్‌ని చూపిస్తూ సొసైలా మీడియాలో పోస్ట్ పెట్టారు బన్నీ. అయితే ఈ పోస్ట్ చూసిన హీరోయిన్ రాశీ ఖన్నా వెంటనే రియాక్ట్ కావడం విశేషం.

'చేతితో చేయబడిన కుండలో కొన్ని ఫ్లవర్స్ పెట్టి దాన్ని నా స్వీట్‌హార్ట్ నాకు ఇచ్చింది' అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా బన్నీ పేర్కొన్నారు. నిజంగా ఫొటో సూపర్.. ఆ ఫొటోలో అల్లు అర్హ, ఫ్లవర్ వాజ్, దాన్ని అందుకుంటోన్న బన్నీ చేయి కనిపిస్తున్నాయి. ఈ పిక్ ద్వారా తండ్రీ కూతుళ్ళ ప్రేమ చూసి పొంగిపోతున్నారు మెగా అభిమానులు. కాగా ఈ పోస్ట్ చూసిన రాశి ఖన్నా 'హౌ క్యూట్.. ప్రేమతో' అని కామెంట్ పెట్టింది. బన్నీ అభిమానులు తెగ షేర్ చేస్తుండటంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Allu Arjun Update.. He shared intresting pic in social media

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సెట్స్‌పై కదులుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు మాటల మాంత్రికుడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మారోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు అల్లు అర్జున్. ఐకాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రాశీ ఖన్నానే హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X