Allu Arjun భార్య అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. స్నేహారెడ్డి లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్!
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్‌ది ప్రత్యేక స్థానం. ఇప్పుడు బన్నీ రేంజ్ ప్యాన్ ఇండియాకు ఎదిగింది. బన్నీ సినిమాకు నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఏర్పడింది. బన్నీ మ్యానరిజం, బన్నీ స్టెప్పులు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. క్రికెటర్లు, హాలీవుడ్ స్టార్లు ఇలా ఒక్కరని లేదు.. ప్రతీ ఒక్కరూ బన్నీని ఫాలో అవుతున్నారు. పుష్ప రాజ్ అంటూ దుమ్ములేపుతున్నారు. అలాంటి బన్నీ భార్య అంటే.. మామూలుగా ఉండకూడదు కదా. అందుకే బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం ఈ మధ్య దుమ్ములేపుతోంది. సౌతిండియన్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే.

అందరిలోనూ తోపు..
సౌత్ ఇండియన్ హీరోల సతీమణులందరిలోకెల్లా అల్లు స్నేహారెడ్డికే ఎక్కువగా మంది ఫాలోవర్లున్నారు. ఆమెను నెట్టింట్లో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. అలా ఆమె అరుదైన రికార్డులను నెలకొల్పింది. ఇకప్పటికీ నమ్రత, ఉపాసన వంటి వారికంటే ఎక్కువ మంది అభిమాన గణంతో ముందు వరుసలో నిల్చుంది.

అందుకే అంత క్రేజ్..
బన్నీకి సంబంధించిన అప్డేట్లు, పిల్లలు అర్హ, అయాన్‌ల అల్లరికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. అందుకే బన్నీ ఫ్యాన్స్ కూడా స్నేహారెడ్డిని ఎక్కువ ఫాలో అవుతుంటారు. ఇక చిన్నారి అర్హ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆమె కోసం కూడా స్నేహరెడ్డిని ఫాలో అవుతుంటారు.

స్పెషల్ డిజైన్స్‌తో స్నేహారెడ్డి
స్నేహారెడ్డికి డిజైనింగ్ రంగంలో అనుభవం ఉంది. ఓ సారి అల్లువారింట్లో జరిగిన ఈవెంట్ మొత్తానికి స్నేహారెడ్డినే డిజైన్ చేసింది. అది చూసి బన్నీ సైతం ఆశ్చర్యపోయాడు. ఆ వీడియోను బన్నీనే స్వయంగా షేర్ చేసి.. స్నేహారెడ్డిని పొగిడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య స్నేహారెడ్డి సైతం మోడల్‌గా మారిపోతోంది.

సమంత ఫ్యాషన్ డిజైనర్‌తో
సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్.. స్నేహారెడ్డికి సైతం పని చేస్తుంటాడు. అతను డిజైన్ చేసిన దుస్తుల్లో స్నేహారెడ్డి తాజాగా మెరిసింది. ఆమెను చూసిన వారంతా కూడా నోరెళ్లబెట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కూడా ఆమె ముందు దిగదుడుపే అంటున్నారు.
ఫ్లవర్ కాదు ఫైర్..
ఇక పుష్ప రాజ్ స్టైల్లో చెప్పాలంటే.. బన్నీ భార్య అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ జనాలు కూడాకామెంట్లు పెట్టేస్తున్నారు. ఫైర్ ఎమోజీలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్నేహారెడ్డి పెట్టిన ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు


Click it and Unblock the Notifications











