IPL 2025: ఐపీఎల్‌లో పుష్ప 2 జోరు.. అల్లు అర్జున్ పాటతో ఆకట్టుకొన్న శ్రేయా ఘోషల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) 2025 టోర్నమెంట్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. సినీ తారలు, క్రికెటర్లు భారీగా తరలిరాగా కన్నుల పండువగా.. కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఖరీదైన టోర్నమెంట్ 18వ సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. ఈ వేడుకలో దిశా పటానీ, షారుక్ ఖాన్, శ్రేయా ఘోషల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పాట మరోసారి ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 2025 టోర్నీలో దాదాపు 74 మ్యాచ్‌లు 13 ప్రాంతాల్లో జరుగనున్నాయి. దాదాపు 10 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పాల్గొంటాయి.

Allu Arjun s Suseki Song at IPL 2025

ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో షారుక్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ వేడుకను ఆయన ప్రారంభించి స్టేడియంలోని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఇక ఈ టోర్నిలో చివరి మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ మే 25 తేదీ 2025 రోజున జరుగనున్నది.

బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ స్టేడియాన్ని తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించింది. భూల్ భులయ్యా చిత్రంలో మేరా ఢోల్నా, రంగ్ దే బసంతి మూవీలో ఓ పాట, ఘుమార్, కర్ హైర్ మైదాన్ ఫతే, దీవాంగీ దీవాంగీ పాటలు ఆలపించి ఆకట్టుకొన్నది. ఇక ఆమె పాటలకు స్టేడియం మొత్తం ఊగిపోయింది. తన గానమాధుర్యంతో ఐపీఎల్ టోర్ని లాంచ్‌ను మధురానుభూతిగా మలిచారు.

ఐపీఎల్ ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషల్ పుష్ప సినిమా తెలుగు వెర్షన్‌లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరిగా ఉంటాడే నా సామీ పాటను పాడి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తమ అభిమాన కథానాయకుడి పాటను ఈడెన్‌లో పాడటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ సంబురాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియోచక్కర్లు కొడుతున్నది.

ఇదిలా ఉండగా, మరో బాలీవుడ్ గాయకుడు కరణ్ ఔజ్లా తలు హిందీ సినిమాల పాటలు పాడారు. ముఖ్యంగా తౌబా తౌబా పాటను ఆయన పాడగా మంచి స్పందన వచ్చింది. స్టేడియంలో ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతూ, ఈలలతో గాయకుడికి మరింత ఉత్సాహాన్ని అందించారు. ఇలా ఎంతో మధురంగా ఈవెంట్‌తో ఐపీఎల్ క్రికెట్ పండగ సంబురాలు ప్రారంభమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X