నువ్ మా బాబాయ్‌వా?.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్.. యాపిల్ సిరిని ఆటపట్టించిన అల్లు అయాన్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్న అయాన్, అర్హలతో ముచ్చటిస్తూ సమయాన్ని గడుపుతుంటాడు. అల్లు అర్జున్ పిల్లలతో చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అల్లు అర్హతో కలిసి చేసే అల్లరి, ముద్దు ముద్దు మాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

క్యూట్ వీడియోలు..
అల్లు అర్హతో చేసిన అల్లరికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్‌ను బూతులు తిట్టిన వీడియో అయితే మరీ హల్చల్ చేసింది. పెళ్లికి సంబంధించిన వీడియో, అందులో అల్లు అర్జున్‌ను ఎదురించి చెప్పడం, అప్పటి వరకు చెప్పినట్టుగా చిలక పలుకులు పలికిన అర్హ.. పెళ్లి విషయంలో మాత్రం అల్లు అర్జున్‌ను విబేధించడం తెగ హల్చల్ చేసింది.

దోశ స్టెప్పులు తెగ ఫేమస్..
అల్లు అర్జున్ రాములో రాముల స్టెప్పులు వేసి ఇంటికి వస్తే అవి ఏంటని అడిగితే దోశలు వేస్తున్నాడని ఎంతో క్యూట్‌గా ఆన్సర్ ఇచ్చింది అర్హ. ఈ మేరకు బన్నీ షేర్ చేసిన వీడియోలు, అర్హ వేసిన దోశ స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియోను బన్నీ తన అభిమానులతో పంచుకున్నాడు.

యాపిల్ సిరిని ఆడుకున్న అయాన్..
యాపిల్‌లో ఉండే సిరిని తన బాబాయ్ సిరి(అల్లు శిరీష్)గా పొరబడ్డాడు అయాన్. ఈ మేరకు బన్నీ చేతికి ఉన్న వాచ్‌తో యాపిల్ సిరిని ఓ ఆట ఆడుకున్నాడు. ఈ మేరకు అయాన్ చేసిన చేష్టలను బన్నీ తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.
Recommended Video

పేరేంటి? పెళ్లెప్పుడు..?
పేరేంటి? అని అల్లు అయాన్ అడగ్గా.. అవతల నుంచి సిరి అని సమాధానం వచ్చింది. మా బాబాయ్‌వా? అని తిరిగి ప్రశ్నించడంతో.. మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అవతల నుంచి సమాధానం వచ్చింది. బాబాయ్ అంటే అంకుల్ అని, మీ పెళ్లెప్పుడు అని యాపిల్ సిరిని ఓ ఆటా ఆడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











