బుల్లి బైక్‌పై చెల్లి, అల్లు అయాన్ షికార్లు.. వీడియో వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ గురించి, వారికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే హల్చల్ అందరికీ తెలిసిందే. పిల్లలతో కలిసి బన్నీ చేసే పనులు, ముద్దు ముద్దు మాటలు ఎంతగానో వైరల్ అవుతుంటాయి. కరోనా విజృంభించడ, లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో బన్నీ పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
బన్నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండగా వీటికి సంబంధించి బయటకు వచ్చిన పిక్స్ ఎంతగానో వైరల్ అవుతున్నాయి. గతవారం జరిగిన అల్లు అయాన్ ఆరవ పుట్టిన రోజు వేడుకలు, అల్లు ఫ్యామిలీ ఫోటోలు ఏ రేంజ్ హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. బన్నీకి అయాన్ అంటే ఎంత ప్రేమో.. ఆయన చేసిన ట్వీట్ చూస్తూనే తెలుస్తోంది. కొడుకు వల్లే ప్రేమంటే ఏమిటో తెలిసిందని చెబుతూ తెగ ఎమోషనల్ అయ్యాడు. అల్లు అర్హ, అల్లు అయాన్‌లు సైతం అంతే ప్రేమతో ఉంటారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

పిల్లలు చేసే అల్లరిని బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో.. పిల్లలు చేసే అల్లరి మరి ఎక్కువయ్యే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో భలే క్యూట్‌గా అంది. సోదరి అల్లు అర్హను ఎక్కించుకుని బుల్లి బైక్‌పై ఇంట్లో షికారు చేసేస్తున్నాడు అల్లు అయాన్.


Click it and Unblock the Notifications











