‘30 రోజుల్లో’ను రిజెక్ట్ చేసిన మెగా కుర్రాళ్లు: వాళ్లిద్దరి వల్లే హీరోగా మారిన ప్రదీప్.. లీకైన షాకింగ్ న్యూస్

లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే' నుంచి సంక్రాంతి సీజన్ వరకూ వచ్చిన చిత్రాలన్నింటినీ ఆడియెన్స్ బాగా ఆదరించారు. ఈ క్రమంలోనే గత వారం యాంకర్ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదలైంది. ఈ సినిమా కూడా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని గతంలో ఇద్దరు మెగా హీరోలు రిజెక్ట్ చేశారన్న న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్

యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్

తనదైన శైలి యాంకరింగ్‌తో తెలుగు బుల్లితెరపై టాప్ హోస్ట్‌గా వెలుగొందుతున్నాడు యాంకర్ ప్రదీప్. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మున్నా తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ సంగీతం అందించాడు.

రికార్డుతో పెరిగిన క్రేజ్.. అన్నీ కుదిరాయి

రికార్డుతో పెరిగిన క్రేజ్.. అన్నీ కుదిరాయి


షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 'నీలి నీలి ఆకాశం' అనే పాట విడుదలై రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

టాక్‌తో షాకైన యూనిట్.. ప్రదీప్‌ మాత్రం

టాక్‌తో షాకైన యూనిట్.. ప్రదీప్‌ మాత్రం

ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. కానీ, హీరోగా మొదటి సినిమా చేసిన ప్రదీప్ నటనపై మాత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు విభిన్నమైన పాత్రల్లో అతడు ఒదిగిపోయి నటించాడని సినిమాను చూసిన ప్రేక్షకులంతా చెబుతున్నారు.

బిజినెస్ జరిగిందిలా.. నాలుగో రోజే ఫినీష్

బిజినెస్ జరిగిందిలా.. నాలుగో రోజే ఫినీష్

యాంకర్ ప్రదీప్‌ మొదటి సినిమా కావడంతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, మొదటి రోజే ఊహించని విధంగా రూ. 1.69 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసేసింది.

‘30 రోజుల్లో’ను రిజెక్ట్ చేసిన మెగా కుర్రాళ్లు

‘30 రోజుల్లో’ను రిజెక్ట్ చేసిన మెగా కుర్రాళ్లు


'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపేసింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రదీప్ దగ్గరకు వచ్చే ముందే ఈ సినిమాను ఇద్దరు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోలు రిజెక్ట్ చేశారన్నదే ఆ న్యూస్ సారాశం.

Recommended Video

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
వాళ్లిద్దరి వల్లే హీరోగా మారిన యాంకర్ ప్రదీప్

వాళ్లిద్దరి వల్లే హీరోగా మారిన యాంకర్ ప్రదీప్

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' కథ ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట. కానీ, అతడికి నచ్చకపోవడంతో అల్లు శిరీష్‌కు కూడా వినిపించాడట దర్శకుడు మున్నా. అయితే, అతడు కూడా ఇందులో చేయడానికి నిరాకరించాడని తెలిసింది. వీళ్లిద్దరూ నో చెప్పిన తర్వాత ప్రదీప్‌కు స్టోరీ చెప్పడం.. అతడు ఓకే చేయడం.. సినిమా హిట్ అవడం చకచకా జరిగాయన్న మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X