వదినమ్మకు క్యూట్ విషెస్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్
అల్లు వారి బంధాల గురించి అందరికీ తెలిసిందే. అల్లు చిచ్చర పిడుగులు అర్హ, అయాన్‌లు చేసే అల్లరి, వారితో పాటు అల్లు శిరీష్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాబాయ్ శిరీష్ ఆధ్వర్యంలో అర్హ, అయాన్‌లు ఆ మధ్య డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. ఈ మేరకు అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. బన్నీ, స్నేహా, శిరీష్‌లు ప్రైవేట్ పార్టీలకు కూడా వెళ్తుంటారు.
ఆ మధ్య ఈ ముగ్గురు పబ్‌లో తెగ సందడి చేశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియలో తెగ వైరల్ అయ్యాయి. నేడు స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా అల్లు వారింట్లో సందడి సందడిగా ఉన్నట్టు తెలుస్తోంది. 'నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీతో ఇలా ఇంకా ఎన్నెన్నో బర్త్ డేలు జరుపుకోవాలని, ఇలా గడపాలని ఉంది.. హ్యాపీ బర్త్ డే క్యూటీ' అంటూ శ్రీమతి ప్రేమ కురిపించాడు బన్నీ.

ఇక వదినమ్మపై ఉన్న తన ప్రేమను కూడా చూపించాడు అల్లు శిరీష్. అప్పుడెప్పుడో పబ్‌లో సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తూ.. స్వీటెస్ట్ అండ్ డియర్ సిస్టర్ ఇన్ లా (వదినమ్మ) అంటూ సింపుల్‌గా సూటిగా సుత్తి లేకుండా అభిమానాన్ని కురిపించేశాడు. ఇక అల్లు స్నేహా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగినట్టు ఆ ఫోటోలను చూస్తూనే తెలుస్తోంది. అన్నింటికంటే అల్లు స్నేహ ధరించిన డ్రెస్ అందర్నీ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











