బాబాయ్‌ను ఫాలో అవుతున్న అర్హ.. 2020లో అందరికీ ఇదే పని.. అల్లు శిరీష్ కామెంట్స్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. నాన్న చెప్పిన మాటలను చిలక పలుకుల్లా వల్లే వేస్తూ.. ముద్దు ముద్దుగా మాట్లాడే అర్హకు సోషల్ మీడియాలో విపరీతనమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్, అర్హల క్యూట్ వీడియోల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తాజాగా బాబాయ్ (అల్లు శిరీష్) నేతృత్వంలో డ్యాన్స్ చేసిన అర్హ.. అందర్నీ ఆకట్టుకుంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

వీడియోలతో హల్చల్..
అల్లు అర్జున్‌తో అర్హ చేసే వాదనలు, తిట్టడం, ఏడ్పించడం ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెళ్లి ముచ్చట్లు, తిట్టు కోవడం, దోశ స్టెప్పులు అంటూ ఎగతాళి చేయడం, దోశ స్టెప్పులు వేయడం ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. అల్లు అర్హకు ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది.

తాజాగా బుట్టబొమ్మ..
అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఖండాలు దాటి ఎక్కడి పాకింది ఈ బుట్టబొమ్మ. అలాంటి పాటను అర్హ ఎంతో క్యూట్‌గా ఆలపించింది. ఓ బుట్టబొమ్మ.. మరో బుట్టబొమ్మ గురించి పాడిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
తాజాగా డ్యాన్స్ వీడియో..
అర్హ, అయాన్‌లు స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో ఓ మైగాడ్ డాడీ ప్రమోషన్ సాంగ్‌లో చూశాం. అయితే వీరికి ఓ గురువు ఉంటే డ్యాన్స్ అదరగొడతారని అర్థమవుతోంది. అల్లు శిరీష్ నేతృత్వంలో అయాన్, అర్హలు డ్యాన్సులు వేశారు. తన బాబాయ్ ఎలాంటి స్టెప్పులు వేస్తే.. అర్హ కూడా అలానే వేసేందుకు ప్రయత్నించింది.

అందరికీ అదే పని..
అల్లు అర్హ డ్యాన్స్ చేస్తున్న క్యూట్ వీడియోను స్నేహారెడ్డి షేర్ చేస్తూ.. సిరి బాబాయ్‌తో సందడి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌కు అల్లు శిరీష్ స్పందిస్తూ.. 2020లో అంకుల్స్ అందరికీ తమ పిల్లలు టిక్ టాక్ చేయించడం పని అయ్యేట్టుందని రాసుకొచ్చాడు. ఈ వీడియోకు కళ్యాణ్ దేవ్ స్పందిస్తూ బుగ్గల అర్హ అంటూ సంబరపడిపోయాడు.


Click it and Unblock the Notifications











