నా హీరో అంటూ అల్లు శిరీష్ రచ్చ.. బన్నీ వీడియో వైరల్
అల్లు బ్రదర్స్ బాండింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా అల్లు అర్జున్ తన ఇంటిని పేరునే ఓ బ్రాండ్‌లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మెగా హీరో అనే ట్యాగ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను అల్లు ప్రొడక్ట్ అని మార్క్ వేసుకుంటున్నాడు. అల్లు వారి జపం తప్ప మరేతర మెగా హీరోల పేర్లను పలకడం లేదు. చిరంజీవి, మెగా ఫ్యామిలీ అనే పదాలకు బన్నీ దూరంగా ఉంటున్నాడు.
ఈ మధ్య తన ప్రసంగాల్లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ అనే మాటే రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అల్లు వారి అన్నదమ్ములు కూడా తమ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. నిహారిక పెళ్లి ఈవెంట్లోనూ అల్లు బ్రదర్స్ కలిసి హంగామా చేశారు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా అల్లు శిరీష్ చేసిన పోస్ట్, షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

పుష్ఫ రాజ్ పరిచయ వేడుక ఈవెంట్‌లో బన్నీ నడిచి వస్తోన్న వీడియోను ఎడిట్ చేసి అల్లు శిరీష్ షేర్ చేశాడు. ఇందులో బన్నీ ఎంతో స్టైలీష్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. నా హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ఆన్ ఫైర్ అన్నట్టుగా ఎమోజీలను షేర్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమయం సందర్భం లేనట్టుగా కొందరు అల్లు శిరీష్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అడుగుతూ వచ్చారు.


Click it and Unblock the Notifications











