ఇప్పటి నుంచే మొదలుపెట్టేసింది.. బన్నీని మించేలా అర్హ.. క్యూట్ వీడియో వైరల్
అల్లు వారి చిచ్చర పిడుగు అర్హ గురించి బన్నీ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి.ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడికి వెళ్తుందని ఆ మధ్య బన్నీ చెప్పుకొచ్చాడు. మామూలుగా అయితే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడ కనిపిస్తే.. కెమెరాలన్నీ అటు వైపు తిరుగుతుంటాయి. ఆ విషయం అర్హకి తెలిసే.. తనతో ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చాడు. తనకు కెమెరాలు, పోజులు ఇవ్వడం ఇష్టమని బన్నీ పేర్కొన్నాడు.

కూతురితో బన్నీ రచ్చ..
అర్హతో బన్నీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ చేసే హడావిడికి అందరూ ఫిదా అవుతుంటారు. పెళ్లికి సంబంధించిన విషయాలు అర్హతో చెప్పించేందుకు బన్నీ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక దోశ స్టెప్పులు అంటూ అర్హ చేసిన కామెడీని ఎవ్వరూ మరిచిపోరు.

గుండెకాయ అంటూ...
బన్నీ తరుచుగా సోషల్ మీడియాలో అర్హ అల్లరిని తన అభిమానులతో పంచుకుంటాడు. ఆ మధ్య అర్హ.. దొండకాయ బెండకాయ నువ్ నా గుండె కాయ అంటూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా అర్హకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది.
రీల్ వీడియో..
తాజాగా అల్లు స్నేహారెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అర్హ ఓ రీల్ వీడియో చేసింది. ఇందులో తనకు ఇష్టమైన ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని.. అయితే స్పెల్లింగ్ చెప్పమంటే మాత్రం.. అలియా భట్ అని మార్చేసింది. ఇందులో అర్హ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇక నటనలో బన్నీని మించిపోయేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video

హీరోయిన్ అవుతుందా?
అయితే అర్హ హీరోయిన్ అవుతుందా? అని సామ్ జామ్ షోలో సమంత అడిగితే బన్నీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా మంచిది.. అమ్మాయిలు కూడా రావాలి.. రాణించాలి.. అర్హ వస్తానంటే నేను వెల్కమ్ చెబుతాను అని ఎంతో గొప్పగా చెప్పేశాడు బన్నీ.


Click it and Unblock the Notifications











