అలా చేస్తే అల్లుడు అదుర్స్ టికెట్స్ ఫ్రీ.. అందుకేనా అంటూ ట్రోల్స్
అల్లుడు అదుర్స్ సినిమా ప్రస్తుతం ఎంతటి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతుందో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ అదే రొడ్డ కొట్టుడు సినిమాను ఎంచుకున్నాడు.. సంతోష్ శ్రీనివాస్ మళ్లీ అదే కందిరీగ సినిమాను అటు తిప్పి ఇటు తిప్పి తీశాడని విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతుంది. సంక్రాంతి రేసులో దిగిన చిత్రాల్లో అత్యంత నాసిరకమని అల్లుడు అదుర్స్‌ను ఏకిపారేస్తున్నారు.
అల్లుడు అదుర్స్ సినిమాపై విమర్శకులు సైతం పెదవి విరిచారు. అల్లుడు అదుర్స్ ఏమో గానీ అల్లుడు బెదుర్స్ అనిపించాడని బెల్లంకొండ శ్రీనివాస్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి మొదటి రోజు ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే అది మాత్రం చాలా తక్కువ ఓపెనింగ్స్ అని తెలుస్తోంది. తాజాగా అల్లుడు అదుర్స్ టీం ఓ స్పెషల్ కాంటెస్ట్ పెట్టింది.

సంక్రాంతికి మొదటి సారిగా అల్లుడు వచ్చాడా? అయితే ఇంటికి వచ్చిన అల్లుడితో ఫోటో దిగి #SankranthiAlludu అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయమని చెప్పారు. అందులో కొందరికీ టిక్కెట్లను ఫ్రీగా ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ నెటిజన్లు మాత్రం దీనిపైనా ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఖాళీగా థియేటర్లున్నాయ్.. టిక్కెట్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయ్.. నువ్ ఫ్రీగా ఇచ్చినా కూడా మేం వెళ్లం.. టిక్కెట్లు అమ్ముడుపోవడం లేదని ఇలా చేస్తున్నారా? అంటూ నెటిజన్లు సెటైర్లువేస్తున్నారు.


Click it and Unblock the Notifications











