సౌందర్య అందుకే ఎక్స్‌పోజింగ్ చేయలేదు.. అన్నీ చూపిస్తే అతను అడగడా: టాప్ సీక్రెట్ లీక్ చేసిన ఆమని

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్ర తర్వాత అంతటి పేరును సంపాదించుకున్న వారిలో సౌందర్య ఒకరు. పేరుకు కన్నడ అందమే అయినా.. తెలుగింటి అమ్మాయిలా కనిపించిందామె. అదే సమయంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తద్వారా ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. ఎక్స్‌పోజింగ్‌కు మాత్రం దూరంగా ఉంది. అసలు ఎందుకు ఆమె గ్లామర్ పాత్రలు చేయలేదు అన్న దానిపై సీనియర్ హీరోయిన్ ఆమని తాజాగా స్పందించారు. దాని వెనుక సీక్రెట్ లీక్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ ఇచ్చిన ఆమని.. వాళ్ల హీరోయిన్

అలా ఎంట్రీ ఇచ్చిన ఆమని.. వాళ్ల హీరోయిన్

'ఆడది' అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఆమని. ఆ వెంటనే వచ్చిన 'జంబ లకిడి పంబ' అనే సినిమాతో భారీ స్థాయిలో పేరు సంపాదించారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయారామె. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనే నటిస్తూ సత్తా చాటారు. సుదీర్ఘమైన కెరీర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, నరేష్ వంటి హీరోలతో ఎక్కువ చిత్రాలు చేశారు.

ఉత్తమ నటనతో అవార్డులు... వరుస ఆఫర్లు

ఉత్తమ నటనతో అవార్డులు... వరుస ఆఫర్లు

సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ పాత్రలతో మెప్పించారు ఆమని. మరీ ముఖ్యంగా 'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం', 'శుభ సంకల్పం' వంటి చిత్రాల్లో ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన 'ఆ నలుగురు' చిత్రానికి గానూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. అంతేకాదు, ఎన్నో మంచి పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు ఆమని.

సౌందర్యతో స్నేహంగా.. ఎక్కువగా ఆమెతోనే

సౌందర్యతో స్నేహంగా.. ఎక్కువగా ఆమెతోనే

అప్పట్లో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో సౌందర్య ఒకరు. ఆమె టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోన్న సమయంలోనే ఆమని కూడా టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. ఈ కారణంగానే ఈ హీరోయిన్లు ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉండేవాళ్లు. ఒకరి షూటింగ్‌లకు ఒకరు వెళ్లేవారు కూడా.

ఇద్దరిదీ ఒకే ప్రాంతం.. ఎప్పుడూ కలిసే ఉంటూ

ఇద్దరిదీ ఒకే ప్రాంతం.. ఎప్పుడూ కలిసే ఉంటూ

అటు సౌందర్య.. ఇటు ఆమని ఇద్దరూ కర్నాటకకు చెందిన వాళ్లే. అంతేకాదు, ఇద్దరూ బెంగళూరు నుంచే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం వల్లే ఈ ఇద్దరూ ఇగోలను పక్కన పెట్టేసి సఖ్యతగా ఉండేవాళ్లు. ఎప్పుడు కలిసినా కన్నడంలో మాట్లాడుకుంటూ.. పాటలు పాడుకుంటూ సరదాగా గడిపేవారు.

సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి ఆమని

సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి ఆమని

2004లో వచ్చిన 'ఆ నలుగురు' తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఆమని. ఇలాంటి పరిస్థితుల్లో 2012లో 'దేవస్థానం' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. మంచి మంచి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'చావు కబురు చల్లగా' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.

సౌందర్య గురించి టాప్ సీక్రెట్ లీక్ చేసిన నటి

సౌందర్య గురించి టాప్ సీక్రెట్ లీక్ చేసిన నటి

తాజాగా ఆమని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకున్నారు. అదే సమయంలో మిగిలిన నటీనటులతో ఉన్న సంబంధాలను గురించి మాట్లాడారు. ఇందులో భాగంగానే తన స్నేహితురాలైన సౌందర్య గురించి టాప్ సీక్రెట్ లీక్ చేశారు సీనియర్ నటి ఆమని.

సౌందర్య అందుకే ఎక్స్‌పోజింగ్ చేయలేదంటూ

సౌందర్య అందుకే ఎక్స్‌పోజింగ్ చేయలేదంటూ


సౌందర్య తనకు క్లోజ్ ఫ్రెండ్ అన్న ఆమని.. ఆమె ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండేదని గుర్తు చేశారు. 'తనకు ఎక్స్‌పోజింగ్ అంటే ఇష్టం ఉండదు. దీనికి కారణం పెళ్లైన తర్వాత భర్త ఎందుకలా చూపించావు అని అడుగుతాడేమోనన్న భయమే. ఈ విషయాన్ని తనే నాకు చెప్పింది. ఈ విషయంలో తనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. కానీ, నేను మాత్రం అలా కాదు' అని చెప్పుకొచ్చారామె.

Recommended Video

RDX Love Trailer | పాయల్ రాజ్‌పుత్ కేక

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X