twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MGMతో అమెజాన్ రికార్డు స్థాయి డీల్.. నెట్‌ఫ్లిక్స్‌‌కు చెక్ పెట్టేందుకు వందల కోట్లతో..

    |

    ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అమెజాన్ మరో భారీ ఒప్పందానికి తెరలేపింది. వినోదరంగంలోని స్ట్రీమింగ్ బిజినెస్‌లో ఎదురవుతున్న గట్టి పోటి నుంచి తట్టుకొనేందుకు భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నది. జేమ్స్ బాండ్ మూవీస్‌ను అత్యధికంగా రూపొందించిన మెట్రో గోల్డ్‌వైన్ మేయర్ (ఎంజీఎం)తో కళ్లు చెదిరే, రికార్డు స్థాయి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Amazon MGM Deal - Amazon Prime Video స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌కు | Netflix || Oneindia Telugu
    ఓటీటీలో అత్యంత ఆదరణ

    ఓటీటీలో అత్యంత ఆదరణ

    అత్యంత ఆదరణ పెరుగుతున్న ఓటీటీ రంగంలో దిగ్గజంగా నిలిచేందుకు ఎంజీఎం స్టూడియోస్‌తో $8.45 బిలియన్ డాలర్లు అంటే రూ.845 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. అమెజాన్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఒప్పందం అని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. గతంలో 2017లో వోల్ ఫుడ్స్‌ కంపెనీని కొనుగోలు చేసేందుకు రూ.1370 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకొన్నది అని అమెజాన్ పేర్కొన్నది.

    స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌

    స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌

    ఎంజీఎంతో ఒప్పందం ద్వారా అమెజాన్ స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌కు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ ఒప్పందం ద్వారా ఎంజీఎం నుంచి 4000 సినిమాలు, 17000 టీవీ షోలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చేరనున్నాయి. దీంతో అమెజాన్‌ స్థానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఎంజీఎం జేమ్స్ బాండ్ సినిమాలకు నంబర్ వన్ బ్రాండ్ అనే విషయం తెలిసిందే.

    200 మిలియన్ల సభ్యత్వాలు

    200 మిలియన్ల సభ్యత్వాలు

    క్వాలిటీ కంటెంట్‌ను వినియోగదారులకు అందించడం ద్వారా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాలను గణనీయంగా పెంచుకొనేందుకు భారీ ప్లాన్స్ వేస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల సభ్యత్వాలను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గతేడాది రూ.1100 కోట్లను ఖర్చు చేసింది.

    ఒరిజినల్ సిరీస్‌లతో

    ఒరిజినల్ సిరీస్‌లతో

    అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఒరిజినల్ కంటెంట్‌పైన కూడా దృష్టిపెట్టింది. ది బిగ్ సిక్, మాంచెస్టర్ బై ది సీ, ది రూపొందించింది. మార్వలెస్ మిసెస్ మైసెల్, ట్రాన్స్‌పరెంట్ చిత్రాలకు అకాడమీ అవార్డులను కూడా సొంతం చేసుకొన్నది. అలాగే 338 కోట్ల రూపాయలతో లార్డ్ ఆఫ్ రింగ్స్ సీరీస్‌ను రూపొందిస్తున్నది. వినోద రంగంలో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ఇదే అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

    14 ఏళ్ల క్రితం స్ట్రీమింగ్ రంగంలోకి

    14 ఏళ్ల క్రితం స్ట్రీమింగ్ రంగంలోకి

    అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫాం 14 ఏళ్ల క్రితం అంటే.. 2006, సెప్టెంబర్ 7వ తేదీన వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ప్రారంభించింది. ఆ తర్వాత బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, టర్కీ, ఇటలీ, చైనా, క్యూబా, నార్త్ కోరియా, ఇరాన్, క్యూబా తదితర దేశాలకు విస్తరించింది. అమెజాన్ కేవలం వినోదరంగంలోనే కాకుండా స్పోర్ట్స్ రంగంలోకి ప్రవేశించనున్నది. 2022లో థర్స్ డే నైట్ ఫుట్‌బాల్‌ను ప్రసారం చేసేందుకు ఎన్ఎఫ్ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నది.

    English summary
    World's biggest chain Amazon $8.45 billion deal with MGM Studios to top in Streaming Inudstry. Its highest second deal to Amazon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X