బిగ్‌బాస్ విజేత ఎవరో తేల్చేసిన అమిత్.. కౌశల్ గురించి సీరియస్ కామెంట్స్.. దీప్తి, తనీష్ రిలేషన్..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపుకు వచ్చింది. ఇంటి నుంచి ప్రతీవారం ఓ సభ్యుడు బయటకు వస్తున్నాడు. తాజాగా అమిత్ తివారీ ఇంటి నుంచి నిష్క్రమించాడు. గతంలో విలన్ ఇమేజ్ ఉన్న అమిత్ ఇప్పుడు సాధుజీవిగా ముద్రను వేసుకొన్నాడు. ఇలాంటి నేపథ్యంలో అమిత్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు.

నూతన్, శ్యామల గురించి
బిగ్‌బాస్ హౌస్‌లోకి నూతన్ నాయుడు, శ్యామల రీ ఎంట్రీ ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. ప్రేక్షకులు ఓట్లు వేసి పంపించారు. వారు వచ్చారు. ప్రేక్షకులు కోరుకొన్నప్పుడు తప్పు ఎక్కడ ఉంది. బిగ్‌బాస్ నుంచి బయటకు పోయి మళ్లీ రావాంటే గొప్ప అదృష్టం ఉండాలి.

తనీష్, దీప్తి సునైన రిలేషన్
తనీష్‌తో నాకు బ్రదర్ మాదిరిగా చూస్తాను. సీనియర్ చైల్డ్ ఆర్టిస్టు అని ఏడ్పిస్తాం. దీప్తి సునైన, తనీష్ మధ్య బంధం బ్రదర్, సిస్టర్ రిలేషన్ మాత్రమే. అంతేకాని మరోరకమైన సంబంధం లేదు. బయట జరుగుతున్న ప్రచారంలో ఏలాంటి వాస్తవం లేదు. అలాగే తేజస్వి, సామ్రాట్ మధ్య కూడా పెద్దగా ఏమిలేదు.

కౌశల్ గొప్పగా ఆడుతున్నాడు
కౌశల్ గొప్పగా ఆడుతున్నాడు. అందరు ఒకవైపు ఉంటే.. ఒంటరిగా కౌశల్ ఆడటం మాములు విషయం కాదు. చాలా గొప్పగా బిహేవ్ చేస్తున్నాడు. మా పిల్లల కారణంగా కౌశల్, నాకు మంచి బంధం ఏర్పడింది. ఫ్యామిలీపరంగా మంచి సంబంధాలున్నాయి. కౌశల్‌తో రెండు సినిమాలు కూడా చేశాను.

కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గ్రేట్
నేను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి థ్రిల్ అయ్యాను. కౌశలే కాదు ఇంట్లో ప్రతీ ఒక్కరికి ఓ స్ట్రాటెజీ, స్టయిల్‌తో ఆడుతున్నారు. కౌశల్‌కు ఉన్న ఆదరణ చూస్తే ఆయనే విజేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీతా మాధురి కూడా బాగా ఆడుతున్నది. ఆమెకు కూడా అవకాశాలు లేకపోలేదు.

కౌశల్‌కు ఆదరణ బాగుందని
కౌశల్ ఆర్మీ లాంటి గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోకపోవడంపై నాకు ఎలాంటి బాధలేదు. కౌశల్‌ను చాలా మంది స్వచ్ఛందంగా అభిమానిస్తున్నారు. ఆయన బ్రహ్మండంగా ఆడటం వల్లనే అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనుకొంటున్నాను.

నాకు కొత్త ఇమేజ్ వచ్చింది
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా నాకు కొత్త ఇమేజ్ వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నా గురించి పాజిటివ్‌గా మారుతున్నారు. బిగ్‌బాస్‌కు ముందు నేను అందరి దృష్టిలో విలన్. కొందరు బయపడి నా వద్దకు రాలేకపోయారు. ఇప్పుడు నేను సాధు స్వభావినని నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











