ఫ్లాష్ బ్యాక్ : బిగ్ బీ వల్లే అల్లరి నరేష్ హీరోగా.. ఆ ఒక్క మాటతో అంతా మారింది!!
ఈవీవీ సత్యనారాయణ గురంచి తెలియని సినీ ప్రేమికుడు, తెలుగువారుండరు. ఎందుకంటే ఆయనందించిన చిత్రాలు అలాంటివి. వినోదాత్మక చిత్రాలు పెట్టింది పేరు ఈవీవీ. సందేశాలను ఇస్తూనే తన స్టైల్లో కామెడీని పంచాడు. అందుకే ఈవీవీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
Recommended Video

ఇద్దరు కొడుకులను..
ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరి కొడుకులను (ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్) సినిమా ఫీల్డ్‌లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆ విషయం చెప్పేవాడట. అన్నయ్య హీరో, నువ్ దర్శకుడివి అంటూ నరేష్‌కు పదే పదే చెప్పేవాడట.

ఈవీవీ దగ్గర అసిస్టెంట్..
నరేష్ కూడా తనకు ఉన్న ఇష్టాన్ని తండ్రి వద్ద చెప్పేందుకు భయపడ్డాడట. అసిస్టెంట్‌గా పని చేస్తున్నా కూడా.. హీరోలు చెప్పిన డైలాగ్స్‌ను ఇంటి కెళ్లి ప్రాక్టీస్ చేసేవాడట. అయితే ఏనాడూ తనకు నటన మీద ఆసక్తి ఉన్నట్టు మాత్రం చెప్పలేదంటా.

అమితాబ్ చొరవతో..
ఈవీవీ తెరకెక్కించిన చాలా బాగుంది సినిమా వంద రోజుల ఫంక్షన్‌కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సమయంలో హిందీలో అమితాబ్‌తో `సూర్యవంశ్` సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈవీవీ. అయితే చాలా బాగుంది సినిమాకు నరేష్ క్యాషియర్‌గా పనిచేశాడు.

ఆ ఒక్క మాటతో..
క్యాషియర్ హోదాలో నరేష్ షీల్డ్ తీసుకుంటుండగా.. ఈవీవీ గారబ్బాయి నరేష్ అని బిగ్‌బీకి పరిచయం చేశారట. మా అబ్బాయిలా పొడుగ్గా ఉన్నాడు... హీరోగా పనికొస్తాడు అంటూ ఈవీవీతో బిగ్ బీ అన్నారట. అలా బిగ్ బీ అనడంతో ధైర్యం తెచ్చుకున్న నరేష్ తండ్రిని ఒప్పించాడట.అనంతరం నటనలో శిక్షణ తీసుకుని ఇలా అల్లరి నరేష్‌గా ఎంతో మందిని నవ్విస్తున్నాడు.


Click it and Unblock the Notifications











