పెద్దలను ఎదురించి క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి.. అండగా పవన్ కల్యాణ్.. గిఫ్ట్ ఏమిచ్చారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆనంద సాయి, తొలి ప్రేమ ఫేమ్ వాసుకి పెళ్లి విషయంలో పవన్ కల్యాణ్ చేసిన సహాయం ప్రత్యేకమైనది. ఇటీవల ఆనంద్ సాయి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ..

 తొలి ప్రేమ సినిమా షూటింగులో

తొలి ప్రేమ సినిమా షూటింగులో

తొలి ప్రేమ సినిమా సెట్లో వాసుకితో నాకు పరిచయం జరిగింది. అయితే మా మధ్య స్నేహం మాత్రమే ఉందని పవన్ కల్యాణ్‌కు తెలుసు. తొలి ప్రేమ సినిమా షూట్ ముగిసే సమయానికి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం. అదే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు చెబితే షాక్ తిన్నారు అని ఆనంద్ సాయి తెలిపారు.

 వాసుకితో పెళ్లికి పెద్దలు నిరాకరణ

వాసుకితో పెళ్లికి పెద్దలు నిరాకరణ

వాసుకితో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో మా తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం. అప్పుడు డబ్బు అవసరం పడితే నేను పవన్ కల్యాణ్‌ను అడిగాను. వెంటనే లక్ష రూపాయలు తీసి ఇచ్చి మా పెళ్లికి సహకరించారు. మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయకపోతే పవన్ ముందుండి పెళ్లి జరిపించారు అని ఆనంద్ సాయి పేర్కొన్నారు.

 పవన్ కల్యాణ్ ఇచ్చిన గిప్ట్

పవన్ కల్యాణ్ ఇచ్చిన గిప్ట్

నా పెళ్లి తర్వాత నేను ఆర్ట్ డైరెక్టర్‌గా నిలదొక్కుకొన్నాను. ఆ తర్వాత లక్ష రూపాయలు తీసుకెళ్లి ఇస్తే తీసుకోవడానికి పవన్ కల్యాణ్ నిరాకరించారు. నీ పెళ్లికి నేను ఇచ్చిన గిఫ్ట్ అది. మీరే ఉంచుకోమని పవన్ చెప్పారు. నా జీవితంలో పవన్ కల్యాణ్ పాత్ర చాలా గొప్పది అని ఆనంద్ సాయి ఉద్వేగానికి గురయ్యారు.

పవన్ కల్యాణ్‌తో కలిస్తే అవే టాపిక్స్

పవన్ కల్యాణ్‌తో కలిస్తే అవే టాపిక్స్

పవన్ కల్యాణ్‌తో స్నేహం గురించి మాటల్లో చెప్పలేం. మేమిద్దరం కొట్టుకొంటాం. మాటలు అనుకొంటాం. కానీ వెంటనే కలిసి పోతాం. పవన్ కల్యాణ్‌ను ఎప్పుడైనా కలిస్తే మా జీవితంలో జరిగిన సంఘటనల గురించి గంటల కొద్ది మాట్లాడుకొంటాం. మా యవ్వనంలో జరిగిన విషయాలు మమల్ని చాలా కనెక్ట్ చేస్తుంటాయి అని చెబుతూ ఆనంద్ సాయి కంటతడి పెట్టుకొన్నారు.

పవన్‌కు మాత్రమే భయపడుతా

పవన్‌కు మాత్రమే భయపడుతా

నా జీవితంలో నేను మా నాన్నకు భయపడే వాడిని. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రమే భయపడుతాను. ఇటీవల మా అమ్మ మరణించిన సమయంలో నాకు చాలా సపోర్ట్‌గా నిలిచాడు. నాకు మానసిక ధైర్యాన్ని అందించాడు. పవన్‌తో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆనంద్ సాయి ఎమోషనల్ అయ్యారు.

 నాకున్న ఏకైక ఫ్రెండ్ పవర్ స్టార్

నాకున్న ఏకైక ఫ్రెండ్ పవర్ స్టార్

నాకు జీవితంలో ఉన్న ఏకైక స్నేహితుడు పవన్ కల్యాణ్. ఇండస్ట్రీలో గానీ, బయట గానీ నాకు పవన్ తప్ప మరో స్నేహితుడు లేడు. పవన్ తర్వాత నాకు ఇండస్ట్రీలో దర్శకుడు వంశీ పైడిపల్లి నాతో స్నేహంగా ఉంటారు. అంతకుమించి మరో వ్యక్తి నాకు స్నేహితుడిగా లేరు అని ఆనంద్ సాయి చెప్పారు.

Recommended Video

Mega Family 2021 Releases | Box Office పై మెగా హీరోల దండయాత్ర
యాద్రాది ఆలయానికి శిల్పిగా

యాద్రాది ఆలయానికి శిల్పిగా

దక్షిణాది సినీ పరిశ్రమలో ఆనంద్ సాయి గొప్ప ఆర్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న యాదాద్రి ఆలయానికి శిల్పిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు. ఆలయ పనులకు సంబంధించిన ఇతర పనులను ఆయన భార్య వాసుకి చూసుకొంటున్నారు. త్వరలోనే యాదాద్రి ఆలయ భక్తుల కోసం ప్రారంభం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X