అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక.. ఆ ఇద్దరు బడా స్టార్స్కు అందని ఆహ్వానం.. కారణం ఇదేనా?
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి ముందు రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకల తర్వాత అంబానీ కుటుంబం ఆదివారం యూరప్ నుండి ముంబైకి తిరిగి వచ్చింది. అయితే ఈ వేడుకల్లో పాల్గొనడానికి కొంతమంది సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరెవరికి ఈ సెలబ్రేషన్స్ కోసం ఆహ్వానం అందలేదు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ గత వారం ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్‌లో విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో గ్రాండ్ తమ తనయుడి ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు జరిగాయి. వేడుకలకు హాజరైన చాలా మంది బాలీవుడ్ తారలు వారాంతంలో ముంబైకి తిరిగి వచ్చారు.

గత బుధవారం ఇటలీలోని పలెర్మోలో క్రూయిజ్ షిప్‌లో ప్రారంభమైన యూరోపియన్ ప్రీ-వెడ్డింగ్‌కు భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు అలియా భట్, అనన్య పాండే, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్, ఎంఎస్ ధోని సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకకు బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌లు అంటే అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కూడా ఆహ్వానం వచ్చింది. అయితే ముఖేష్ అంబానీ తన కొడుకు రెండవ ప్రీ వెడ్డింగ్‌కి ఈసారి ఆహ్వానించని వారి లిస్ట్ లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వేడుకల్లో పాలు పంచుకున్న సెలబ్రిటీల కంటే ఆహ్వానాలు ఎవరెవరికి అందలేదు అనే విషయంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది.

ఈ జాబితాలో చెప్పుకోవాల్సిన మొదటి పేరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తరువాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పేరు విన్పిస్తోంది. బాలీవుడ్ లో వీరిద్దరూ ఖాన్ల త్రయానికి ఏమాత్రం తీసిపోరు. అలాంటిది బిగ్ బీని, అక్షయ్ ను అంబానీ ఫ్యామిలీ ఎందుకు ఆహ్వానించలేదు అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. పార్టీలో వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం.

నిన్నటిదాకా నడిచిన ఎన్నికల వేడి నేపథ్యంలో అమితాబ్, అక్షయ్ బీజేపీ సపోర్టర్స్ కాబట్టి అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకకు పిలవలేదని టాక్ నడుస్తోంది. మరికొంత మంది మాత్రం అలాంటిది ఏమీ ఉండదు. పిలిచినా ఈ ఇద్దరు స్టార్స్ బిజీగా ఉండడం వల్ల వెళ్లలేదేమో అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో!? కాగా జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకోనున్నారు.


Click it and Unblock the Notifications











