Ambani Marriage: ళ్లికి ముందే అనంత్ అంబానీతో కలిసి రాధిక మర్చంట్ అలాంటి వేడుక.. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ!
దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. అయితే పెళ్ళికి ముందు ఈ కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ప్రత్యేక పూజలు చేయబోతున్నారని సమాచారం. అది కూడా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య అని తెలుస్తోంది. మరి ఆ పూజా కార్యక్రమాల కథేంటో ఓ లుక్కేద్దాం పదండి.
ఇండియాలోనే బిగ్గెస్ట్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఈ ఏడాది మార్చి నుంచి జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా మార్చ్ నుంచి వీరిద్దరి గురించి టాక్ నడుస్తోంది. కాబోయే వధూవరులకు సంబంధించిన ఫోటోలే వైరల్ అవుతున్నాయి. అనంత్ - రాధికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఫిబ్రవరిలో 1 నుంచి 3వ తేదీన మధ్య జామ్‌నగర్‌లో జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్స్ నుండి విదేశీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.

ఆ తరువాత పెళ్లికి ముందే అనంత్-రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించారు. మే 29న ఇటలీలో ప్రారంభమైన క్రూయిజ్‌లో మొదలైన రెండవ ప్రీ-వెడ్డింగ్ బాష్ జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసింది. ఈ వేడుకకు కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖ్యలతో పాటు అంతర్జాతీయ సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకల హడావిడి మొదలైంది.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తనకు కాబోయే భార్య, వ్యాపారవేత్త బీరెన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో 2024 జూలై 12న వివాహం చేసుకోబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఇదొకటి కాబోతుండగా, ఈ నెల 29 నుంచి అనంత్-రాధిక వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంత్-రాధికల వివాహ వేడుక మతపరమైన పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుందని అంబానీ కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మీడియా కథనాల ప్రకారం జూన్ 29న అనంత్, రాధిక ప్రత్యేకంగా పూజలు చేయబోతున్నారు. ఇందులో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని సమాచారం. రాధిక, అనంత్ ముంబైలోని బాంద్రాలో ఉన్న కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం చేసుకోనున్నారు. శుక్రవారం జూలై 12న వివాహ వేడుక జరగనుంది. దీనికి పెళ్లి ఆహ్వాన పత్రికపై 'శుభ వివాహం' అని పేరు పెట్టారు.
ఈ ఫంక్షన్‌కి సంబంధించిన డ్రెస్ కోడ్‌ను 'భారత సంప్రదాయం'గా పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 'శుభ్ ఆశీర్వాద్' వేడుక జూలై 13న జరగనుంది. జూలై 14న జరిగే 'మంగళ ఉత్సవ్' అంటే వివాహ రిసెప్షన్‌తో అంబానీ కుటుంబంలో పెళ్లి సంబరాలు ముగుస్తాయి. పెళ్ళికి కూడా దేశవిదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఇక పెళ్లి వేడుక అంబానీ కుటుంబం ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరంలో జరిగే అత్యంత ఉన్నతమైన వివాహాలలో ఒకటిగా చరిత్రను క్రియేట్ చేయబోతోంది. మరి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు టాలీవుడ్ లో వారికైనా ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











