Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరు హాజరుకానున్నారు అంటే..?
ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల బిడ్డగా అనంత్ కు పేరు ఉంది. ఇక అంబానీల కుటుంబంలో పెళ్లి అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.
ఇప్పటికీ ఇషా అంబానీ పెళ్లి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా కాలం తరువాత అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అనంత్ పెళ్లి కొడుకుగా మారాడు. రాధిక మర్చంట్ తో అనంత్ పెళ్లి ఈ ఏడాది జూలై 12 న జరగనుంది. వీరి నిశ్చితార్ధ వేడుకనే అంగరంగ విభవంగా నిర్వహించారు.

ఇక అప్పటినుంచి వీరి వెళ్లి వరకు నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంది. మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని సందడి చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు అనంత్ - రాధికా రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సమయం ఆసన్నమైంది.
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మే 29 మరియు జూన్ 1 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది.అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క రెండవ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ యొక్క థీమ్ 'టెర్రా అండ్ మేర్' అంటే ల్యాండ్ అండ్ సీ. ఈ థీమ్ అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ల మధ్య ఉన్న సంబంధాల స్వభావాన్ని ఉత్తమంగా వివరిస్తుంది.
అనంత్ అంబానీ మొదటి ప్రీ-వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. వారి మొదటి ప్రీ-వెడ్డింగ్ బాష్ యొక్క థీమ్ గ్రౌండింగ్ కాగా.. రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక యొక్క థీమ్ సముద్రం. దాదాపు వారం రోజులు ఈ క్రూయిజ్ షిప్ లోనే వేడుకలు జరగనున్నాయి. ఈ గ్రాండ్ పార్టీలో రణబీర్ కపూర్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్ వంటి దాదాపు 800 మంది దేశవిదేశీ ప్రముఖులు పాల్గొననున్నారు. అతిథులకు సేవ చేయడానికి షిప్‌లో దాదాపు 600 మంది స్టాఫ్ అందుబాటులో ఉంటారు.
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ-వెడ్డింగ్ బాష్ మే 29న స్వాగత భోజనంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్టార్రీ నైట్ ఈవెంట్ జరగనుంది. అతిథులు రోమ్‌లో దిగి , క్రూయిజ్‌లో టోగా పార్టీతో రోజు ముగిస్తారు. అనంతరం వారు కేన్స్‌లో మాస్క్వెరేడ్ బాష్‌కు హాజరవుతారు.. ఆ తరువాత క్రూయిజ్‌లో ఆఫ్టర్ పార్టీతో ముగిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జూన్ 1న ముగియనుంది.


Click it and Unblock the Notifications











