అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రథమ వివాహ వార్షికోత్సవం: యాదిలో జస్టిన్ బీబర్, కర్ధాషియాన్, రిహాన్నా మెరుపులు
సరిగ్గా ఏడాది క్రితం అంటే జూలై 12వ తేదీన ముంబై మహా నగరంలో చిన్ననాటి స్నేహితులైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ హృదయనేస్తాలుగా మారిపోయి జీవితాంతం కలిసి జీవించడానికి తొలి అడుగు వేశారు. జీవిత భాగస్వాములుగా వారిద్దరి కలయిక సందర్భంగా జరిగిన వేడుకలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పూలతో అలంకరించిన మండపాలు, వాటి మధ్య తారళ తళుకుబెళుకులు, హృదయ పూర్వకంగా దీవెనలు, సంతోషాల మధ్య వీడ్కోలు, ప్రతీ క్షణం మధురానుభూతిగా మార్చాయి.
ప్రేమ, సుసంపన్నమైన సంస్కృతులు సంబురాల్లో ప్రతిబింబించాయి. ఇదంతా పెళ్లి వేడుకలను మించి జరిగాయంటే నమ్మాల్సిందే. చరిత్రలో సంస్కృతి, సంప్రదాయాలకు మైలురాయిగా నిలుస్తుంది. ఈ వేడుక ముంబైని లవ్, గ్లామర్, హెరిటేజ్‌కు గ్లోబల్ క్యాపిటల్‌గా మార్చింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు.. వరల్డ్ మోస్ట్ ఐకానిక్ పర్సనాలిటీల ఆరడుగుల బంధానికి ఓ సెలబ్రేషన్‌గా మారింది.

జామ్ నగర్‌లో 3 రోజులపాటు ఐకానిక్‌గా జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి దిల్ దడ్కే దో స్టయిల్‌లో సాగిన క్రూయిజ్ పార్టీ, ముంబై బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో విలాసవంతంగా జరిగిన శుభ్ వివాహం వరకు సెలబ్రేషన్ ఓ అందమైన కలను మించి ఉత్సవాన్ని తలపించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ దిగ్గజాల కలయిక ఈవెంట్‌లో ప్రధానమైన హైలెట్‌గా మార్చింది. ఈ వేడుక ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసింది.
అందమైన దంపతులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వారి తొలి వివాహ వార్షికోత్సవాన్ని జూలై 12వ తేదీన ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈ భూప్రపంచంపై అత్యంత అరుదుగా జరిగే పండుగలా, ఇండియాలో జరిగిన అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిన అద్బుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకొందాం. అంబానీ-మర్చంట్ కుటుంబాల మధ్య జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో బాలీవుడ్, హాలీవుడ్ ఆఫ్ స్క్రీన్‌లో మమేకమైన తీరు, వారి స్పిరిట్, డ్యాన్స్, రియల్ టైమ్ సెలబ్రేషన్, అలాగే ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర దిక్కులను కలిపిన వేడుకను ఓ సినిమాటిక్ అనుభూతిని మించిందని చెప్పవచ్చు.

సంగీత్ వేదిక నుంచి మండపం వరకు, వేడుకలోని ప్రతీ కార్నర్‌లో గ్లోబల్ గ్లామర్, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక సందర్భంగా ఇండియా, యూరప్‌లో కళ్లు మిరుమిట్లుగొలిపే స్థాయిలో ఫ్యాషన్ షోలు, గ్లామర్ ఉట్టిపడే దుస్తుల అలంకరణాలు, జ్యువెల్లరీ, జస్టిన్ బీబర్, క్యాటీ పెర్రీ, రిహాన్నా లాంటి దిగ్గజాలుతో కూడిన ఇంటర్నేషనల్, ఇండియన్ సెలెబ్రిటీలతో జరిగిన ఉత్సవాలు గ్రాండ్ అఫైర్‌గా మారాయి.
జామ్ నగర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో రిహాన్నా తళుకు బెళుకులు
అనంత్, రాధిక పెళ్లి సందర్భంగా జామ్ నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో రిహాన్నా రేర్ పెర్ఫార్మెన్స్ సంగీత ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఇండియాలో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది. బాలీవుడ్ సినిమా పాటలకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శిస్తూ చేసిన అభివాదాలు అభిమానులను ముగ్దుల్ని చేసింది. డైమండ్స్, వి ఫౌండ్ లవ్ లాంటి హిట్స్‌తో వేదిక వద్ద హంగామా చేసింది. అంబానీ ఫ్యామీలతో ఆమె మమేకమైన తీరు, వారితో సంభాషించిన విధానం, బాలీవుడ్ స్టార్స్ పొగడ్తలు భారతీయ ఆతిథ్యంపై ఆమె గుప్పించిన ప్రశంసలు అందరి హృదయాలను దోచుకొన్నాయి. క్రూయిజ్ పార్టీ సందర్భంగా బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, పిట్‌బుల్ బ్రింగ్ ది హౌస్ డౌన్ పాటలతో కేటీ పెర్రీ ముంబైలోని వెడ్డింగ్ వీక్‌కు వన్నె తీసుకొచ్చారు. ఫ్రెంచ్ రివీరా నైట్‌లో భాగంగా బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్‌తో కేటీ పెర్రీ మరోసారి భారతీయ సంగీత ప్రియులను 90 దశకం నాటి అనుభూతులను గుర్తు చేశారు. మూడు తరాల సంగీతాభిమానులకు మరుపురాని అనుభూతిగా మార్చారు. అమెరికన్ ర్యాపర్ పిట్ బుల్ తన హై ఆక్టేన్ పెర్ఫార్మెన్స్‌తో డెక్‌ను ఫ్లోటింగ్ నైట్ క్లబ్‌గా మార్చారు.
తారలతో కూడిన సంగీత్ ఈవెంట్‌కు జస్టిన్ బీబర్ వెలుగులు
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన సంగీత్ వేడుకను జస్టిన్ బీబర్ తన ఎలక్రిఫైయింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో మధురానుభూతిని మిగిల్చాడు. స్ట్రీట్ వేర్‌లో ప్రత్యక్షమైన బీబర్ బేబీ, పీచెస్ లాంటి హిట్స్‌తో వేదికను ఇంప్రాంప్టో కాన్సర్ట్ హాల్‌గా మార్చారు. సంగీత్ వేడుకలో అతిథులతో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కొద్ది నిమిషాలకే ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పెర్ఫార్మెన్స్‌ను కేమియో అంటే తప్పు అవుతుంది. గ్లోబల్ పాప్, ఇండియన్ సంప్రదాయ మ్యూజిక్‌తో ఆయన నిర్వహించిన ఈవెంట్ ఫుల్ స్కేల్ మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిగిల్చింది.
కర్ధాషియాన్ సిస్టర్స్ గ్లామరస్ ఫ్యాషన్ పెరేడ్
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లహెంగా ధరించి. ఇండియన్ హెరిటేజ్ జ్యువెల్లర్స్ డిజైన్ చేసిన డైమండ్స్, ఎమరాల్డ్ నగలు ధరించిన కిమ్ కర్దాషియాన్, ఖోల్ ఖర్దాషియాన్ ఇండియాలో అడుగుపెట్టిన సీన్ హై ఫ్యాషన్ ఫాంటసీగా మార్చింది. వారిద్దరూ మెహందీ, రిసెప్షన్ వేడుకల్లో పాలుపంచుకొని గ్లామర్‌కు అడ్డగా నిలిచారు. అనంత్ అంబానీ రిసెప్షన్‌లో బంగారం ఎంబ్రాయిడరీ చేసిన చీర లాంటి గౌన్ ధరించిన లుక్ టాక్ ఆఫ్ ధి ఈవెంట్‌గా మార్చింది. దేశీ ట్రెడిషన్‌లో వెస్ట్రన్ భామలు తళతళ మెరిసిపోయారు. చివరగా ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఒక్కసారి వెనక్కి తిరిగి నెమరు వేసుకొంటే అనంత్, రాధిక వెడ్డింగ్ కేవలం రెండు హృదయాల కలయికకు సంబంధించిన సెలబ్రేషన్ కాదు. భారతీయ సంస్కృతి ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసింది. అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకకు ప్రపంచం మొత్తం హృదయపూర్వకంగా, గౌరవంగా స్వాగతం పలికింది.


Click it and Unblock the Notifications











