నేను ఆంటీలా ఉండటమేంటండీ బాబూ... యాంకర్ అనసూయ!
Recommended Video

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆమె ఇటీవలే షేర్ చాట్‌లో సైతం ఖాతా తెరిచారు. తను చేసే సినిమాలు, టీవీ షోలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే ఈ తెలుగు బ్యూటీ వారంలో కనీసం ఒక్కసారైనా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తుంటారు. తాజాగా ఆమె లూవ్ చాట్ చేస్తుండగా... మీరు అస్సలు ఆంటీలా ఉండరు అంటూ పొగడ్తలు గుప్పించాడో అభిమాని. ఈ కామెంటుపై అనసూయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

నేను ఆంటీలా ఉండటమేంటండీ బాబూ...
మీరు అసలు ఆంటీలా ఉండరు? అని ఓ అభిమాని వ్యాఖ్యానించగా... అనసూయ స్పందిస్తూ ‘‘ఆంటీలాగా ఉండటమేంటండీ బాబూ.. నేను ఆంటీని మా పిల్లల ఫ్రెండ్స్‌కి... జనాలు ఎందుకు ఇలా ఆలోచిస్తారో అర్థం కాదు. ఏజ్ అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతుంది.'' అని అనసూయ వ్యాఖ్యానించారు.

50 ఏళ్ల వయసులో ఇంతే అందంగా
నేను ప్రతి సంవత్సరం ఎదుగుతున్నాను నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అయితే 50 ఏళ్ల వయసులో కూడా ఇంతే అందంగా ఉన్నాను అని చెప్పుకునే రోజు వస్తుందని అనుకుంటున్నాను అని అనసూయ వ్యాఖ్యానించారు.

అనసూయ పోస్టులకు అభిమానులు ఫిదా
ఇటీవల అనసూయ సముద్రపు ఒడ్డున నేచర్ ఎంజాయ్ చస్తూ... జివితాంతం ఇలా సముద్రాన్ని చూస్తూ ఉండిపొమ్మన్నా ఉండిపోతాను అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఆమె షార్ట్స్ వేసి హాట్ లుక్‌తో దర్శమివ్వడంతో అభిమానులు ఫిదా అయిపోయారు.

చేతిలో ఉన్న సినిమాలు
అనసూయ ఓ వైపు టీవీ షోలు చేస్తూ.... మరో వైపు సినిమాల్లో నటిస్తున్నారు. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు సచ్చిందిరా గొర్రె, కథనం అనే చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











