నీ వెన్నంటే ఉండి అన్నీ గమనిస్తుంటాను.. కొడుకుపై అనసూయ కామెంట్స్ వైరల్
అనసూయ బుల్లితెరపై, వెండితెరపై ఎంతలా రచ్చ చేస్తుందో సోషల్ మీడియాలో అంతకు మించి దుమ్ములేపుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసే తెలుగు యాంకర్లలో అనసూయ ముందుంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే సెలెబ్రిటీల్లోనూ అనసూయే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అనసూయ చేసే పోస్ట్‌లు దాదాపు అన్నీ కూడా వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ మధ్య అనసూయ తన ఫ్యామిలీ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

గోవాలో రచ్చ..
ఇటీవలె అనసూయ తన భర్త బర్త్ డే సెలెబ్రేషన్స్‌ను గోవాలో ప్లాన్ చేసింది. ఫ్యామిలీ అంతా కలిసి రోడ్డు ట్రిప్ వేశారు. కారులో గోవాకు వెళ్లి అక్కడ రచ్చ చేశారు. గోవాలో దిగిన అనసూయ ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. బుల్లి నిక్కరు వేసుకుని యంగ్ హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోని అందంతో గోవాను అల్లాడించింది అనసూయ.

సండే రోజు అలా..
వీకెండ్ అయితే అనసూయ షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. సండే వస్తే ఇంట్లో పండగన్నమాటే. ఫ్యామిలీ అందరూ కలిసి ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంటి చుట్టుపక్కల వారితో కలిసి రోడ్డు మీదే క్రికెట్ ఆడుతుంటారు. భర్త, పిల్లలు కలిసి క్రికెట్ ఆడిన వీడియోలను అనసూయ షేర్ చేస్తూనే ఉంటుంది.

అలా అనడంతో..
ఈ మధ్యే అనసూయ తన బాబు అన్న మాటలకు కన్నీరు పెట్టుకుందట. 2020లోని విపత్కర పరిస్థితులను చూసి చిన్న పిల్లాడు కూడా భయపడ్డాడని, ఇలా ఎందుకు ఉంది.. మళ్లీ మనం అప్పటి ఎలా ఎప్పుడు ఉంటామని అని తనను ప్రశ్నించడంతో ఏడుపు వచ్చిందంటూ అనసూయ ఎమోషనల్ అయింది.

బర్త్ డే స్పెషల్..
తాజాగా అనసూయ తన చిన్న కుమారుడి బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ‘నా చిన్న రాకుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన వంశానికి నువ్వే ఉత్సాహాన్ని నింపావు.. నుమ్ నీ లెగో(ఓ రకమైన బొమ్మ)ను ఎంత ప్రేమిస్తున్నావో.. అంతకంటే ఎక్కువగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము.. ఓ మంచి మనిషిగా ఎదిగేందుకు ఆ దేవుడు నీకు దారి చూపాలి.. నీ వెన్నంటే ఉండి నేను నిన్ను గమనిస్తుంటాను' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











