ఆ సింగర్ ఇంట్లో అనసూయ రచ్చ.. అలా ప్రేమతో చంపేశాడట!!
అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద చేసే రచ్చ అందరికీ తెలిసిందే. స్కిట్ల మధ్యలో అనసూయ వేసే పంచ్‌లు.. అనసూయను కేంద్రంగా చేసుకుని వేసే స్కిట్‌లు ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు నాగబాబుతో అనసూయ కలిసి వేసే పంచ్‌లు, స్టెప్పులు బాగానే వైరల్ అయ్యేవి. నాగబాబు వెళ్లాక.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంతో మందిని తీసుకొచ్చారు. చివరకు సింగర్ మనో ఫిక్స్ అయ్యాడు. ఆయన ఈ మధ్య బాగానే రెచ్చిపోతోన్నాడు.

పంచ్‌లతో వైరల్..
జబర్దస్త్ స్కిట్స్ మధ్యలో యాంకర్, జడ్జ్‌లు వేసే పంచ్‌లు ఎంతగా క్లిక్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య సింగర్ మనో వేసే సెటైర్లు బాగానే క్లిక్ అవుతున్నాయి. సింగర్ మనో, రోజా, అనసూయలు జబర్దస్త్‌లో టీం లీడర్ల కంటే ఎక్కువగా పంచ్‌లు వేస్తున్నారు. మనోను జబర్దస్త్ టీం అందరికీ మరింత దగ్గర చేసింది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసిపోయినట్టున్నారు.

తాజాగా అలా..
జబర్దస్త్ కలిపిన బంధం వల్ల అనసూయ.. చెన్నైకి వెళ్లిన సందర్భంగా సింగర్ మనో ఇంటికి వెళ్లినట్టుంది. ప్రస్తుతం అనసూయ చెన్నైలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న విజయ్ సేతుపతి కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టినట్టు కనిపిస్తోంది. విజయ్ సేతుపతితో దిగిన ఫోటోను షేర్ చేసి అనసూయ రచ్చ చేసింది.

మనో ఇంట్లో రచ్చ..
అయితే అనసూయ చెన్నైకి ఎందుకు వెళ్లిందో తెలియడం లేదు. కానీ అక్కడ మాత్రం బాగానే సందడి చేసినట్టు కనిపిస్తోంది. సింగర్ మనో ఇంటికి వెళ్లిన అనసూయ అక్కడ బాగానే లాగించినట్టు కనిపిస్తోంది. పొట్ట పగిలేలా ఫుడ్ పెట్టి ప్రేమతో చంపేసే మనో గారు అంటూ బాగా తింటోన్న ఫోటోను షేర్ చేసింది.
Recommended Video

పోస్టర్లతో రచ్చ..
అనసూయ ఈ మధ్య తన కొత్త సినిమా పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలోనే ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. పోస్టర్లలో మాస్క్, లిఫ్ట్, గర్భం దాల్చిన అనసూయను చూస్తుంటే కథలో మంచి ఎమోషన్స్ ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











