twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకెన్ని జరిగితే బుద్ది వస్తుంది.. ఆ ఘటనపై అనసూయ ఆవేదన

    |

    ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఆ ప్రకోపంలో ఎంతటి విధ్వంసం కలుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రకృతి విపత్తులు వచ్చాక వాటిపై రియాక్ట్ అవ్వడం కంటే.. వాటిని రాకుండా నివారించే పద్దతులను అవలంభించాలని అందరూ చెబుతుంటారు. వరదలు, భూకంపాలు, మంచు చరియలు విరిగిపడటం వంటివన్నీ కూడా ప్రకృతి ప్రమాదాలే. మనం ప్రకృతిని విచ్చల విడిగా వాడటం, వాటిని నాశనం చేస్తుండటంతో ఊహకందని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగింది కూడా అదే.

    భారీ వరద..

    భారీ వరద..

    ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఈ క్రమంలో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ఆ ప్రవాహాంలో తపోవన్‌-రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్నరిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ పని చేస్తున్న 170 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికీ ఎంత మంది మరణించారు.. ఎంత మంది కనిపించకుండాపోయారన్న లెక్కలు బయటకు రాలేదు.

    దేశం మొత్తం..

    దేశం మొత్తం..

    ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఉత్తరాఖండ్ వైపు చూస్తోంది. మంచు చరియలు విరిగిపడటం, ధౌలి గంగా, అలకనంద నదులు ఉప్పొంగడం, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోవడం, ప్రాణ, ఆస్తి నష్టం జరగుతుండటంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.

    సెలెబ్రిటీల రియాక్షన్..

    సెలెబ్రిటీల రియాక్షన్..

    ఇలాంటి విపత్తులు, ప్రకృతి కోపానికి ప్రతిచర్యగా జరిగే సంఘటనలపై సెలెబ్రిటీలు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన విధ్వంసంపైనా స్పందించారు. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్స్ అందరూస్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలుకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

    అనసూయ ఫైర్..

    అనసూయ ఫైర్..

    అయితే అనసూయ మాత్రం కాస్త గట్టిగానే స్పందించింది. మరో విపత్తు మనల్ని కొట్టేసింది.. ప్రకృతిని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ సహజీవనం చేయాల్సిన సమయం ఇది కాదా?.. మనం గుణపాఠం నేర్చుకోవాలంటే.. ఇంకెన్ని విపత్తులు సంభవించాలి?.. ఉత్తరాఖండ్ ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని అనసూయ ఆవేదన చెందింది.

    English summary
    Anasuya Bharadwaj Emotional on Uttarakhand Glacier Disaster
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X