ఇటలీలో అనసూయ.. అందుకోసమే పయనం.. అక్కడి వీధుల్లో రంగమ్మత్త రచ్చ
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఫుల్ బిజీగా ఉంది. పలు సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పుడు అనసూయ విదేశాలకు చెక్కేసింది. ఇటలీలోని మిలాన్‌లో అనసూయ ప్రత్యక్షమైంది. అయితే అనసూయ ఓ మూవీ షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లింది. అయితే అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

అలా వైరల్..
అనసూయ ఈ మధ్య చేసిన స్పెషల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. చావు కబురు చల్లగా మూవీ కోసం అనసూయ చేసిన పైన పటారం అనే పాట ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అనసూయ చేసిన మ్యాజిక్, వేసిన మాస్ట్ స్టెప్పులు ఫుల్ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం అలా..
అయితే అనసూయ ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఖిలాడీ మూవీ యూనిట్ ఇటలీలో ఉంది. రవితేజ మీద కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీన్స్‌లో అనసూయ కూడా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

అందుకే అలా..
ఖిలాడీ మూవీ కోసమే ఇటలీకి వెళ్లిన అనసూయ నేడే అక్కడ అడుగుపెట్టినట్టుంది. హలో మిలాన్ అంటూ అనసూయ అదిరిపోయేలా కనిపించింది. అక్కడి వీధుల్లో తిరుగుతూ రంగమ్మత్త చేస్తోన్న రచ్చ బాగానే వైరల్ అవుతోంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రవితేజ కూడా..
రెండు రోజుల క్రితం రవితేజ కూడా ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇటలీలో ఉన్నట్టు తెలిపాడు. సినిమా సెట్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది. నవ్వులు చిందిస్తూ కనిపించి మాస్ మహారాజా తన అభిమానులకు కిక్కిచ్చాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మే 28న రాబోతోంది.


Click it and Unblock the Notifications











