అందంతో అదరగొట్టిన అనసూయ.. బుల్లి స్కర్ట్, పొట్టి టీ షర్ట్‌లో జోష్ మాములుగా లేదే!
బుల్లితెరకు, యాంకరింగ్‌కు గ్లామర్ టచ్ ఇచ్చింది అనసూయ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షో అనేది అనసూయ హాట్ గ్లామర్‌తో అలా నిలబడిపోయింది. అనసూయ అందాన్ని, యాంకరింగ్‌లో ఇంతటి గ్లామర్‌ను చూసి సుమ సైతం అసూయ పడిందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. అలాంటి అనసూయకు రోజురోజుకీ వయసు తగ్గుతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.

రచ్చరచ్చ..
లాక్ డౌన్ కాలంలో ట్వీట్లు, లైవ్‌లో అందాల ఆరబోత, సామాజిక సమస్యలపై స్పందిస్తూ అనసూయ నానా రచ్చ చేసింది. రోజూ ఏదో ఒక వివాదంలో అనసూయ ఉంటూ వచ్చేది. లాక్ డౌన్ మధ్యలో లైవ్‌లోకి వచ్చి అందాల విందు చేసిన అనసూయ ఫోటోలు సోషల్ మీడియాను కుమ్మేశాయి.

లాక్ డౌన్ తర్వాత..
దాదాపు మూడు నెలల లాక్ డౌన్ తరువాత బుల్లితెర షూటింగ్‌లు మొదలయ్యాయి. అప్పటి వరకు ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నవారికి షూటింగ్‌లు ప్రారంభం కావడమనేది ఊపిరినిచ్చాయి. అందులో భాగంగా జబర్దస్త్ షూటింగ్ మొదలయ్యాక చాలా మందిలో సందడి మొదలైంది. మొదటగా అనసూయ మాత్రం అంతకు ముందు కన్నా రెట్టింపు ఉత్సాహంతో సెట్స్‌పైకి దూకింది.

కొత్త కొత్త స్టైల్, క్యాస్టూమ్స్..
జబర్దస్త్ కోసం అనసూయ ఈ మధ్య కొత్త కొత్త హెయిర్ స్టైల్, డిఫరెంట్ క్యాస్టూమ్స్‌ను వాడుతోంది. అనసూయ తన జుట్టును పూర్తిగా మార్చి వేసింది. ఆ మధ్య అనసూయ హెయిర్ స్టైల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఇంగ్లీష్ పిల్లలా మారిపోయిన అనసూయపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

ఫోటో షూట్లు వైరల్..
అనసూయ ప్రతీ వారం ఫోటో షూట్లు చేస్తూనే ఉంటుంది. ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగానే అనసూయ ప్రత్యకంగా ఫోటో షూట్ కూడా చేయించుకుంటూ ఉంటుంది. వాటికి సరికొత్త పంచ్ లైన్ యాడ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
Recommended Video

బుల్లి ప్యాంట్, పొట్టి టీ షర్ట్..
బుల్లి ప్యాంట్, పొట్టి టీ షర్ట్‌లో అనసూయ చిన్న పిల్లలా కనిపిస్తోంది. వయసు తగ్గిపోతుందా? అన్నంత అందంగా కనిపిస్తోంది. రోజూ మూడు పూటలా మెనూలో అందాన్ని తింటుందా? అనే అనుమానం కలిగేలా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications