ఆ వయసులో గంటల తరబడి.. వాటిని చూస్తుంటే ఎలా.. అనసూయ కామెంట్స్ వైరల్

అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. మీడియా రంగం నుంచి బుల్లితెర.. అటు నుంచి వెండితెర.. ఇలా అన్నింటిలోనూ తన మార్క్‌ను చూపుతూ వస్తోంది అనసూయ. జబర్దస్త్ యాంకర్‌గా యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వెండితెరపై అసాధారణ ప్రతిభను కనబర్చి ఇంకా ఎంతో మందికి దగ్గరైంది. రంగస్థలం చిత్రం తరువాత ఎంతో మంది మదిలో రంగమ్మత్తగా చిరస్థాయిగా చోటు సంపాదించుకుంది. బుల్లితెర, వెండితెరపై ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి వివాదాన్ని, సంచలనాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఆమె వేసిన ఓ ట్వీట్ మళ్లీ చర్చను లేవనెత్తింది.

 సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

అనసూయ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాలు, సామాజిక సమస్యలు తన అభిమానులతో చర్చిస్తుంది. అంతే కాకుండా ఫోట్ షూట్‌లతో నానా రచ్చ చేస్తుంది. ఆమె ట్వీట్స్ నిత్యం ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే ఉంటుంది.

ఆ మధ్య ఈఎంఐలపై..

ఆ మధ్య ఈఎంఐలపై..

లాక్‌డౌన్ విధించిన మొదట్లో అనసూయ ఓ ట్వీట్ చేసింది. లాక్ డౌన్ విధిస్తే, పనులు చేసుకోకవపోతే.. ఇళ్లు ఎలా గడుస్తుంది.. ఈఎంఐలు ఎలా కట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అనసూయపై సెటైర్స్ వేస్తూ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేశారు.

ఏనుగు ఘటనపై..

ఏనుగు ఘటనపై..

ఆ మధ్య కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. మానవజాతి ఒక చెత్త అంటూ ఓ రేంజ్‌లో విరుచుకపడింది. పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి ఏనుగుకు అందించడం, అది చనిపోవడంతో దేశం మొత్తం ఖంగుతింది. ఈ ఘటనపై అనసూయ తీవ్ర ఆవేదన చెందింది.

ఆన్‌లైన్ క్లాసులపై..

ఆన్‌లైన్ క్లాసులపై..

తాజాగా అనసూయ ప్రభుత్వ విద్యా విధానంపై స్పందించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అందరూ ఆన్ లైన్ విధానానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ.. చిన్న వయసు వారు గంటల తరబడి ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు చూస్తుంటే వారి కళ్లు పాడైపోతాయి. చిన్న పిల్లల విద్యావిధానంలో ఆన్ లైన్ కాకుండా వేరే పద్దతి ఏదైనా ఆలోచించండని ప్రభుత్వానికి సూచించింది. ఇక అనసూయ ట్వీట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X