తన ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫొటోను రివీల్ చేసిన అనసూయ.. రెండు మూడో వాడు కూడా.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు సుపరిచితురాలు అయిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకుంది. అందంతో పాటు అభినయం కూడా కనబరచే నైపుణ్యం ఉండడంతో సినిమాల్లోనూ రాణిస్తోంది. టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. తాజాగా తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫొటోను రివీల్ చేసింది. ఆ సంగతులు మీకోసం.!

నటి అనసూయ భరద్వాజ్ నేపథ్యం ఇదే

నటి అనసూయ భరద్వాజ్ నేపథ్యం ఇదే

చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరి.. దానికి రాజీనామా చేసింది అనసూయ. ఆ తర్వాత సినీ రంగంపై ఉన్న మక్కువతో నటన వైపు అడుగేసింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ తర్వాత ఓ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే 2013లో సుశాంక్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ఈ జంటకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు.

జబర్ధస్త్‌గా సాగుతోన్న అనసూయ కెరీర్

జబర్ధస్త్‌గా సాగుతోన్న అనసూయ కెరీర్

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న సమయంలోనే అనసూయకు జబర్ధస్త్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. ఈ షోలో ఎంటర్ అయిన కొద్ది రోజులకే ఆమె విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. జబర్ధస్త్ షో వల్ల పేరుతో పాటు ఎన్నో అవకాశాలు అందుకుంది ఈ హాట్ యాంకర్ అనసూయ.

ఆమె కెరీర్‌లో ఆ రెండూ గుర్తుండిపోతాయి

ఆమె కెరీర్‌లో ఆ రెండూ గుర్తుండిపోతాయి

వరుసగా టీవీ షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది అనసూయ. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘నాగ'లో నటించిన ఆమె.. చాలా గ్యాప్ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన'తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘క్షణం' అనే మూవీలో లీడ్ రోల్ చేసి మెప్పించింది. ఈ పాత్ర వల్ల అనసూయకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘రంగస్థలం'లోని రంగమ్మత్త క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

భర్తపై ప్రేమ.. అతడి గుర్తుగా ఎదపై టాటూ

భర్తపై ప్రేమ.. అతడి గుర్తుగా ఎదపై టాటూ

అనసూయ.. సుశాంక్‌ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుందన్న విషయం తెలిసిందే. తన భర్త అంటే ఆమెకు ఎంత ఇష్టమో చాలా సార్లు బహీర్గతం చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, తన భర్త గుర్తుగా ఆమె ఎదపై ‘నిక్కూ' అనే టాటూ వేయించుకుంది. నిక్కూ అంటే సుశాంక్ ముద్దు పేరట. ఈ విషయాన్ని గతంలో అనసూయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

సుశాంక్‌తో రొమాన్స్... అను తీరుపై విమర్శలు

సుశాంక్‌తో రొమాన్స్... అను తీరుపై విమర్శలు

టీవీ షోలు.. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ... సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో పాటు పర్సనల్‌ విషయాలు కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే సుశాంక్‌తో చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఎన్నో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.

ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫొటోను రివీల్ చేసిన అనసూయ

ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫొటోను రివీల్ చేసిన అనసూయ

ప్రస్తుతం లాక్‌డౌన్ పిరియడ్ కొనసాగుతున్న కారణంగా ఇంట్లోనే ఉంటోంది అనసూయ. ఈ క్రమంలోనే తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ కోరిక మేరకు తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫొటోను రివీల్ చేసింది అనసూయ.

Recommended Video

Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life
ఫస్ట్ మాత్రమే కాదు.. రెండు, మూడో వాడు కూడా

ఫస్ట్ మాత్రమే కాదు.. రెండు, మూడో వాడు కూడా

‘మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు' అని నెటిజన్ అడగగానే.. ఓ వ్యక్తితో దిగిన ఫోటోను పోస్ట్ చేసి ‘ఇతనే నా మొదటి, రెండు, మూడో బాయ్ ఫ్రెండ్. అంతేకాదు.. ఇప్పుడూ భవిష్యత్‌లోనూ తనే నా ప్రియుడు' అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అందులో ఉన్నది మరెవరో కాదు.. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X