For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవుడా కొంచెం దయచూపు.. ఆవేదన చెందుతున్న అనసూయ

  |

  జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్‌గా ప్రతీ ఒక్కరినీ అలరిస్తూ ఉంటే.. వెండితెరపై అద్భుతమైన నటనను కనబరుస్తూ లెక్కలేనంతా అభిమాన గణాన్ని సొంతం చేసుకుంటోంది. నటన, వాక్ చాతుర్యం, అందం, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కదాంట్లో తనకు తానే సాటి అనిపించుకునే అనసూయకు సోషల్ మీడియాలోనే కాస్త నెగెటివిటీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఆమెను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వారిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా తీవ్ర ఆవేదనకు గురైంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

  సోషల్ మీడియాలో యాక్టివ్..

  సోషల్ మీడియాలో యాక్టివ్..

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ నిత్యం హాట్ ఫోటోషూట్‌లతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అనసూయ షేర్ చేసే పిక్స్ వివాదానికి దారి తీస్తుంటాయి. ముఖ్యంగా అనసూయ వస్త్రధారణపైనే నిత్యం వివాదాలు నడుస్తుంటాయి.

  అర్థం కాని ట్వీట్లు..

  అర్థం కాని ట్వీట్లు..

  ఒక్కోసారి అనసూయ అర్థం కాని ట్వీట్స్ వేస్తుంటుంది. అది ఎవరిని ఉద్దేశించి చేసిన కామెంట్సో ప్రత్యక్షంగా చెప్పదు. ఆ మధ్య ఇలాగే ఓ ట్వీట్ చేసింది. మనదాకా వస్తే గానీ అర్థమవ్వదు కొందరికి అంటూ సెటైర్స్ వేసింది. ఫేక్ న్యూస్, వెబ్‌సైట్స్‌పై విజయ్ దేవరకొండ ఫైర్ అయిన సమయంలోనే అనసూయ ఈ ట్వీట్ చేయడంతో మరింత వైరల్ అయింది.

  లైవ్‌లో హల్చల్..

  లైవ్‌లో హల్చల్..

  లాక్‌డౌన్‌లో ఉన్నంత కాలం అనసూయ ఓ రెండు మూడు సార్లు లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అయితే లైవ్‌లోకి వచ్చిన ప్రతీసారి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనసూయ నాభి అందాలు ఓ సారి బయటపడగా.. మరోసారి తన డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేసిన నెటిజన్‌పై విరుచుకుపడి వార్తల్లో నిలిచింది. తాజాగా ఉత్తరాఖండ్ అడవుల దహనంపై ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయింది.

  గత నాలుగు రోజులుగా..

  గత నాలుగు రోజులుగా..


  ఉత్తరాఖండ్ అడవుల్లో రేగినా కార్చిచ్చు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ మంటలు ఇంకా ఆరకపోవడంతో ఎన్నో అరుదైన జాతి వృక్షాలు, జంతువులు, పక్షులు ఆ మంటల్లో దగ్దమవుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ వైఫల్యంపై అందరూ మండిపడుతున్నారు. తాజాగా అనసూయ కూడా ఈ ఘటనపై స్పందించింది.

  Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life
  దేవుడా కొంచెం దయ చూపు..

  దేవుడా కొంచెం దయ చూపు..


  అడువుల్లో రేగిన మంటలపై స్పందిస్తూ.. ‘ఈ వార్తలు నిజమా? అసలేం జరుగుతోంది? దేవుడా దయచేసి కొంచెం దయ చూపు.. మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం.. అక్కడ జంతువులు, ప్రకృతి వనరులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దయచేసి సంబంధిత అధికారులు స్పందించి.. అక్కడ సాయం చేయండి.. నేను ఈ 2020ని ద్వేషిస్తున్నాను.. ఎందుకు మంచి పరిణామాలు సంభవించడం లేద'ని ఆవేదన చెందింది.

  English summary
  Anasuya Worried About Uttarakhand Fire Accident In Forest. She Says That As we are sitting here there are many animals and resources that are burninng alive!!!! Please the concerned officials there might need more support .. I officially hate 2020 .. why did it even come god!!!!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X