twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నైలో అనసూయ సందడి.. స్టార్ హీరోతో మంతనాలు.. అసలు కథ ఏంటి?

    |

    అనసూయ గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో సందడి చేస్తూనే కొత్త సినిమా అప్డేట్లు, పోస్టర్లతో అనసూయ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనలోని నటిని మళ్లీ తట్టి లేపేందుకు అదిరిపోయే కథతో మన ముందుకు రాబోతోన్నట్టు తెలుస్తోంది. గర్భవతిగా నటిస్తూ అందర్నీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. థ్యాంక్యూ బ్రదర్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లతో అనసూయ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

    బిజిబిజీగా..

    బిజిబిజీగా..

    అనసూయ ప్రస్తుతం బిజీబిజీగా గడిపేస్తోంది. బుల్లితెర షోలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోన్న అనసూయ.. ఇప్పుడు సినిమాలతోనూ బిజీ అవుతోంది. మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం తరువాత మళ్లీ మరో ప్రాజెక్ట్‌ను అనసూయ కన్ఫామ్ చేయలేదు. ఈ లాక్డౌన్‌లో వచ్చిన థ్యాంక్యూ బ్రదర్ కథ, కాన్సెప్ట్ నచ్చడంతో ఓకే చెప్పేసింది. సైలెంట్‌గా షూటింగ్ కూడా కానిచ్చేసింది.

    పోస్టర్లతో రచ్చ..

    పోస్టర్లతో రచ్చ..

    అయితే లాక్డౌన్ కాలంలోనే ఈ మూవీ షూటింగ్‌ను కూడా కానిచ్చేశారు. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలోనే ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. పోస్టర్లలో మాస్క్, లిఫ్ట్, గర్భం దాల్చిన అనసూయను చూస్తుంటే కథలో మంచి ఎమోషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. లాక్డౌన్‌లో కష్టాలు ఎదుర్కొన్న ప్రెగ్నెంట్ లేడీగా అనసూయ నటించి అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

     ప్రస్తుతం చెన్నైలో..

    ప్రస్తుతం చెన్నైలో..

    అయితే అనసూయ ప్రస్తుతం చెన్నైలో సందడి చేస్తోంది. అక్కడి వాతావరణం బాగుందంటూ చిన్న పిల్లలా డ్యాన్సులు కూడా చేసింది. అయితే చెన్నై వెళ్లడానికి కారణాలు ఏంటో తెలియలేదు. కానీ అక్కడ స్టార్ హీరోను కలిసినట్టు అనసూయ ఓ ఫోటోను షేర్ చేసింది.

    Recommended Video

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    విజయ్ సేతుపతితో..

    విజయ్ సేతుపతితో..

    ప్రస్తుతం అనసూయ విజయ్ సేతుపతితో కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. అనసూయ నవ్వులు చిందిస్తూ విజయ్ సేతుపతిని ఏదో ఆట పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా ప్రాజెక్ట్ విషయంలో కలిశారా? లేదా తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనసూయ వెళ్లి కలిసిందా? అన్నది తెలియడం లేదు.

    English summary
    Anasuya Fun With Vijay Sethupathi In Chennai,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X