సముద్రపు ఒడ్డున అలా.. సేదతీరుతోన్న లాస్య.. గోవాలో రచ్చ రచ్చ!
బిగ్ బాస్ షో తరువాత యాంకర్ లాస్య ఎలా దూసుకుపోతోందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కంటే ముందుగా బుల్లితెరపై కనిపించి చాలా కాలమే అయింది. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతను ఇచ్చి బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. అలా బిగ్ బాస్ షోతో మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది లాస్య. మొత్తానికి ఇప్పుడు లాస్యకు బుల్లితెరపై మంచి డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కుతోంది.

వంటలక్కగా ఫేమస్..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు లాస్య వంటలక్కగా గుర్తింపు సాధించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లకు వంటలు వండి పెట్టడం, నిత్యం కిచెన్‌లోనే ఉండటంతో నెటిజన్లు లాస్యకు అలా వంటలక్క అనే ట్యాగ్‌ను ఇచ్చేశారు. ప్రస్తుతం లాస్య యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

బిగ్ బాస్ షో మీదే..
బిగ్ బాస్ షో ద్వారా ఇమేజ్ తెచ్చుకున్న లాస్య.. తన యూట్యూబ్ చానెల్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ హల్చల్ చేసింది. లాస్య చేసే స్పెషల్ వీడియోలు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేశాయి. అయితే లాస్య యూట్యూబ్ చానెల్ అలా దూసుకుపోవడంతో మధ్యలో హ్యాక్ కూడా అయింది.

యూట్యూబ్ హ్యాక్..
లాస్య దూకుడుకు హ్యాకర్లు కల్లెం వేశారు. లాస్య చేసే ప్రతీ వీడియో మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా మధ్యలో తన యూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడంతో లాస్య ఆందోళన చెందింది. కానీ త్వరగానే మళ్లీ తన అకౌంట్ తన చేతిలోకి రావడంతో ఫుల్ ఖుషీ అయింది.
ట్రావెలింగ్ వీడియో..
మామూలుగా లాస్య తన పర్సనల్ విషయాలకు సంబంధించిన వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా సెలెబ్రిటీలను కూడా తీసుకొచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా లాస్య ట్రావెలింగ్ వీడియోను కూడా చేసేసింది.

గోవాలో రచ్చ..
తాజాగా లాస్య తన భర్తతో కలిసి గోవాకు వెళ్లింది. గోవాలో చేసిన రచ్చను వీడియో తీసి తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడే చేసింది. గోవా వ్లాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజాగా లాస్య షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలా సముద్రపు ఒడ్డున, ఇసుక తిన్నెల మీద కూర్చుని చిల్ అవుతున్న లాస్య ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











