Just In
- 32 min ago
నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. ఇప్పటికీ అదే బుద్ది.. హృతిక్‌పై ఘాటుగా కంగన
- 37 min ago
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- 1 hr ago
Uppena 15 Days Collections: ‘చెక్’ పెడుతూ పుంజుకున్న ఉప్పెన.. ప్రభాస్ రికార్డుకు చేరువైన వైష్ణవ్!
- 2 hrs ago
జబర్ధస్త్ సెట్లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు
Don't Miss!
- News
చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో .. ఒక 420 వ్యవహారం : సజ్జల ఫైర్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Automobiles
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
సోషల్ మీడియాలో యాంకర్ రష్మిని ఫాలో అయ్యే వారికి అసలు నిజ స్వరూపం తెలుస్తుంది. తెరపై రష్మీని చూసి అందరూ ఒకలా అనుకుంటారు కానీ సోషల్ మీడియాలో రష్మీ అసలు సంగతి తెలుస్తుంది. మూగ జీవాల కోసం పాటు పడుతూ ఉంటుంది. వాటి సంరక్షణ కోసం రష్మీ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వరుసగా సంక్రాంతి, కోడి పందెల గురించి ఎమోషనల్ అవుతూ పోస్ట్‌లు పెడుతోంది.

కోడి పందెలకు వ్యతిరేకం కాదు..
కోడి పందెలకు వ్యతిరేకం కాదని చెబుతూ వాటిని హింసించడం, వాటికి విషపు కత్తులు పూయడం, వాటిని హింసించడం వంటివి చేయడం తప్పంటూ రష్మీ చెప్పుకొచ్చింది. తాను కేవలం హిందూ పండుగలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని క్లారిటీగా చెప్పింది.

పండుగ అంటే అదే..
ఇక సంక్రాంతి పండుగ పతంగిల గురించి మాట్లాడుతూ.. నైలాన్, మాంజాలను వాడకండి.. సంతోషాన్ని పంచడమే పండుగల ముఖ్య ఉద్దేశ్యం. అది రక్తం చిందించడంతో ఎన్నడూ జరగదంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. తాను బక్రీద్‌లో జరిగే ఘటనలపైనా స్పందించానని.. మళ్లీ హిందువుల పండుగలపైనే స్పందిస్తాను అని తప్పుగా భావించకండని చెప్పుకొచ్చింది.

తాజాగా అలా..
తాజాగా రష్మీ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెడుతోంది. మాంజాలు వాడటం వల్ల పక్షులకు గాయాలు అవుతున్నాయంటూ ఆవేదన చెందింది. అంతేకాకుండా గాయపడ్డ పక్షి మళ్లీ గాల్లో ఎగిరేలా చేయడంతో రష్మీ సంతోషాన్ని వ్యక్తంచేసింది. ఇలా పక్షులు గాయపడ్డ వీడియోలను రష్మీ షేర్ చేస్తూ ఎమోషన్ అవుతుంది.
ఎప్పుడు మారింది..
తాజాగా రష్మీ మరోసారి సంక్రాంతి, మాంజా వాడకంపై ప్రశ్నలు సంధించింది. గాలి పటాలు ఎగిరేయడం మన సంప్రదాయమైతే.. కానీ దాంట్లో నైలాన్, మాంజాలు, గాజు పూసిన మాంజాలను వాడటం సంప్రదాయంగా ఎప్పుడు మారిందంటూ ప్రశ్నించింది. మాంజాలు వాడటంతో ఎన్నో పక్షులకు గాయాలు అవ్వడంతో రష్మీ ఎమోషనల్ అయింది.