twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన

    |

    సోషల్ మీడియాలో యాంకర్ రష్మిని ఫాలో అయ్యే వారికి అసలు నిజ స్వరూపం తెలుస్తుంది. తెరపై రష్మీని చూసి అందరూ ఒకలా అనుకుంటారు కానీ సోషల్ మీడియాలో రష్మీ అసలు సంగతి తెలుస్తుంది. మూగ జీవాల కోసం పాటు పడుతూ ఉంటుంది. వాటి సంరక్షణ కోసం రష్మీ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వరుసగా సంక్రాంతి, కోడి పందెల గురించి ఎమోషనల్ అవుతూ పోస్ట్‌లు పెడుతోంది.

    కోడి పందెలకు వ్యతిరేకం కాదు..

    కోడి పందెలకు వ్యతిరేకం కాదు..


    కోడి పందెలకు వ్యతిరేకం కాదని చెబుతూ వాటిని హింసించడం, వాటికి విషపు కత్తులు పూయడం, వాటిని హింసించడం వంటివి చేయడం తప్పంటూ రష్మీ చెప్పుకొచ్చింది. తాను కేవలం హిందూ పండుగలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని క్లారిటీగా చెప్పింది.

    పండుగ అంటే అదే..

    పండుగ అంటే అదే..

    ఇక సంక్రాంతి పండుగ పతంగిల గురించి మాట్లాడుతూ.. నైలాన్, మాంజాలను వాడకండి.. సంతోషాన్ని పంచడమే పండుగల ముఖ్య ఉద్దేశ్యం. అది రక్తం చిందించడంతో ఎన్నడూ జరగదంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. తాను బక్రీద్‌లో జరిగే ఘటనలపైనా స్పందించానని.. మళ్లీ హిందువుల పండుగలపైనే స్పందిస్తాను అని తప్పుగా భావించకండని చెప్పుకొచ్చింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    తాజాగా రష్మీ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెడుతోంది. మాంజాలు వాడటం వల్ల పక్షులకు గాయాలు అవుతున్నాయంటూ ఆవేదన చెందింది. అంతేకాకుండా గాయపడ్డ పక్షి మళ్లీ గాల్లో ఎగిరేలా చేయడంతో రష్మీ సంతోషాన్ని వ్యక్తంచేసింది. ఇలా పక్షులు గాయపడ్డ వీడియోలను రష్మీ షేర్ చేస్తూ ఎమోషన్ అవుతుంది.

    ఎప్పుడు మారింది..

    తాజాగా రష్మీ మరోసారి సంక్రాంతి, మాంజా వాడకంపై ప్రశ్నలు సంధించింది. గాలి పటాలు ఎగిరేయడం మన సంప్రదాయమైతే.. కానీ దాంట్లో నైలాన్, మాంజాలు, గాజు పూసిన మాంజాలను వాడటం సంప్రదాయంగా ఎప్పుడు మారిందంటూ ప్రశ్నించింది. మాంజాలు వాడటంతో ఎన్నో పక్షులకు గాయాలు అవ్వడంతో రష్మీ ఎమోషనల్ అయింది.

    English summary
    Anchor Rashmi About Kites And Manjas
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X