twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యాలంటైన్స్ డే అని అలా చేయకండి.. బ్రేకప్ అయితే రోడ్డు మీదకు.. యాంకర్ రష్మీ ఆవేదన

    |

    యాంకర్ రష్మీ మూగ జీవాల కోసం ఎంతగా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. పెట్స్‌ను ఏ షాప్‌లోనూ కొనకండి.. ఎక్కడైనా దత్తత తీసుకోండంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ తాజాగా కొన్ని పోస్ట్‌లు పెట్టింది. రానున్నది ప్రేమికుల రోజు. ఆ సందర్భంగా తమ ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు గానూ కొందరు పెట్స్‌ను బహుమతులుగా ఇస్తుంటారు. అయితే వీటిపై రష్మీ స్పందించింది.

    అందరికీ అవగాహన..

    అందరికీ అవగాహన..

    మూగ జీవాలైన పశువులు, పక్షులు, జంతువుల కోసం రష్మీ నిరంతరం పాటు పడుతూనే ఉంటుంది. వాటికి ఏ చిన్న ఆపద కలిగిందని తెలిసినా, వాటిని ఎవరైనా హింసిస్తున్నారని కంట్లో పడినా కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది. అలాంటి వారిని వేలెత్తి చూపుతుంది.

    ఆచార సంప్రదాయాలు..

    ఆచార సంప్రదాయాలు..


    ఆచార సంప్రదాయాల పేరిటి మూగ జీవాలను హింసించడంపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. బక్రీద్ నాడు గోవులను హింసించడం, సంక్రాంతి నాడు కోడి పందెల పేరిట వాటికి విషం పూసి, కత్తులు కట్టి దాడి చేయించడవం వంటి వాటిపై ఫైర్ అవుతూ ఉంటుంది.

    పెంపుడు కుక్కలపై..

    పెంపుడు కుక్కలపై..

    ఇక రష్మీ ముఖ్యంగా పెంపుడు కుక్కలు, వీధి కుక్కలకు సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా పెడుతుంటుంది. పెట్స్‌కు ఎలాంటి సమస్యలు వచ్చినా, వాటికి ఏం జరిగినా కూడా స్పందిస్తుంటుంది. అలాంటి రష్మీ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా పెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వకండని కోరింది.

    వాటిని నమ్మకండి..

    వాటిని నమ్మకండి..

    వేలంటైన్స్ డే అంటూ పెట్స్‌ను గిఫ్ట్‌లు అంటూ చెప్పే వాటిని నమ్మకండి.. అవి సరైన బ్రీడ్‌కు చెందినవి కూడా కావు.. అయినా ఓ జీవిని ఇలా గిఫ్ట్‌గా ఇవ్వకండి.. ఎందుకంటే అది దాదాపు పదిహేను నుంచి ఇరవై యేళ్ల బాధ్యత.. ఒకసారి బ్రేకప్ జరిగితే.. వాటిని రోడ్డు మీద వదిలేస్తారు.. పైగా పెట్స్‌ను పెంచాలంటే ఆర్థిక స్థోమత కూడా ఉండాలి.. వాటి పట్ల ఓ ఎమోషన్ బాధ్యత ఉండాలంటూ రష్మీ చెప్పుకొచ్చింది.

    Recommended Video

    PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
    దత్తత తీసుకోండి..

    దత్తత తీసుకోండి..


    అసలు ఆ పెట్ స్టోర్‌ లైసెన్స్డ్ అవునా? కాదా? చెక్ చేయండి.. అవన్నీ ఇల్లీగల్ బ్రీడ్స్.. వాటికి సరైన వైద్య సదుపాయాలు కూడా అందించరు.. ఆడ పెట్స్‌ను బలవంత పెడుతుంటారు.. మరో పెట్‌కు జన్మనిచ్చేలా బాధపెడుతుంటారు.. అసలు దత్తత తీసుకోండి.. కానీ ఇలా కొనుక్కోకండి.. పైగా ఇలా జీవాలను బహుమతులుగా ఇచ్చుకోకండని రష్మీ వేడుకుంది.

    English summary
    Anchor Rashmi About Pets Gifts On Valentines day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X