ప్రతీ అమ్మాయి అలా తయారవ్వాలి.. కూతురిని అలా చూపించి టచ్ చేసిన యాంకర్ రవి
యాంకర్ రవి తన ఫ్యామిలీని పరిచయం చేయకముందు ఇమేజ్ వేరు.. తన భార్యాపిల్లలను పరిచయం చేశాక వచ్చిన ఇమేజ్ వేరు. ముఖ్యంగా భార్య నిత్య, పాప వియాలతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ ఎమోషనల్ అయిన రవికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. అంతేకాకుండా ఈ తండ్రీకూతుళ్ల రిలేషన్ చూసి ఎంతో మంది ఫిదా అయ్యారు. అలా యాంకర్ రవి ప్రస్తుతం తన ఫ్యామిలితో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.

ఫ్యామిలీతో అలా..
ఒకప్పుడు అసలు తనకు పెళ్లి అయిందనే విషయాన్ని కూడా ఎంతో సీక్రెట్‌గా ఉంచాడు. పెళ్లై, ఓ పాప ఉన్నా కూడా పెళ్లి కాని వాడిలానే ప్రవర్తించేవాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా తన పెళ్లి గురించి అడిగినా కూడా చెప్పకుండా తప్పించుకునేవాడు. చివరకు మాత్రం తన సీక్రెట్లన్నీ బయట పెట్టకతప్పలేదు. అప్పటి నుంచి రవి తన ఫ్యామిలీ గురించి నిత్యం సోషల్ మీడియాలో చెబుతూనే వస్తున్నాడు.

భార్యాపిల్లలతో సరదాగా..
రవి తన భార్యాపిల్లలతో కలిసి చేసే సందడి, వేసే అల్లరి వేషాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ మధ్యే పెళ్లి రోజు సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశాడు. అంతే కాకుండా తన యూట్యూబ్ చానెల్‌లో రవి వెరైటీ వీడియోలను కూడా చేస్తున్నాడు. పెళ్లాంతో ఉండే బాధలు, వారితో కలిసి షాపింగ్‌కు వెళ్తే ఎలాంటి కష్టాలుంటాయో చెబుతూ చేసిన వీడియోలు బాగానే క్లిక్ అయ్యాయి.

పాపతో అలా..
ఇక వియా అయితే అందరికీ ఫేవరేట్‌గా మారింది. ఆ మధ్య రవి, వియాలు కలిసి చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా లాక్డౌన్‌లో వియాతో చేసిన ఫన్నీ వీడియోలన్నీ బాగానే క్లిక్ అయ్యాయి. వియాతో కలిసి దాగుడు మూతలు ఆడిన వీడియో ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా వియాకు స్వాతంత్ర్య సమర యోధురాలి గెటప్‌ను వేయించాడు రవి.
Recommended Video
ఝాన్సీ లక్ష్మీ బాయి..
ఇందులో ఝాన్సీ లక్ష్మీ బాయి తన పిల్లాడిని వీపుకు కట్టుకుని పోరాటం చేసినట్టు దృశ్యాన్ని తన పాప వియాతో వేయించాడు. అలా ఝాన్సీ రాణిలా చిన్నారి వియా కూడా ఎంతో బాగా నటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్క అమ్మాయి కూడా ఓ యోధురాలిగా మారాల్సిందే అని రవి చెబుతూ ఈ వీడియోను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











