ఇదేనా స్నేహమంటే.. అలా వదిలేసి పారిపోతాడా?.. అలీ రెజాపై యాంకర్ రవి సీరియస్
యాంకర్ రవి, అలీ రెజా మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. అలీ రెజా బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో యాంకర్ రవి బయటి నుంచి ఎంతగా సపోర్ట్ చేశాడో అందరం చూశాం. పటాస్ షోలో శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేసినా కూడా ఏనాడూ ఆమెకు మద్దతుగా మాట్లాడలేదు. పైపెచ్చు రాహుల్, వరుణ్ సందేశ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలా బిగ్ బాస్ షో ద్వారానే అలీ రెజా, యాంకర్ రవి బంధం గురించి అందరికీ తెలిసిందే.

స్టేజ్ మీద రచ్చ..
అలీ రెజా కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు యాంకర్ రవి. తనకు ఓ సమస్య వచ్చినప్పుడు, ల్యాండ్ విషయంలో డబ్బులు పోయే సమయంలో అలీ రెజా సాయం చేశాడంటూ స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు. అలీ రెజా నా ఫ్రెండ్ అంటూ అందరి ముందే ఎమోషనల్ అయ్యాడు.

ఫ్యామిలీతో కలిసి..
ఇక ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఈ ఇద్దరూ ట్రిప్స్‌కు వెళ్తుంటారు. ప్రైవేట్ పార్టీలు చేసుకుంటారు. అలీ రెజా భార్య మాసుమా, యాంకర్ రవి భార్య నిత్య సక్సేనాలు కూడా స్నేహితులయ్యారు.

తాజాగా అలా..
యాంకర్ రవి ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో పడిన సంగతి తెలిసిందే. అందుకే భార్య, పిల్లలతో కలిసి యూట్యూబ్‌లో స్పెషల్ కాన్సెప్ట్‌లతో వీడియోలు చేస్తుంటాడు. అవి బాగానే క్లిక్ అవుతుంటాయి. తాజాగా రవి తన ఫస్ట్ ట్రావెల్ వీడియోను షేర్ చేశాడు.

ఇద్దరూ కలిసి..
దోస్త్ గాడితో కలిసి దోస్త్ పెళ్లికి అంటూ యాంకర్ రవి తన ఫస్ట్ వ్లాగ్‌గా షేర్ చేశాడు.అందులో రవి, అలీ రెజా కలిసి చేసిన రచ్చంతా ఉంది. ఒక సందర్భంలో యాంకర్ రవిని అలీరెజా ఇరికించి పారిపోయాడు. దీని గురించి రవి సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్ చేశాడు.

బిల్లు ఎగ్గొట్టేశాడు..
ఇదేనా స్నేహమంటే.. ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తే.. బిల్లు సగం సగం కట్టాలి కదా? కానీ అలీ రెజా మాత్రం మధ్యలోనే ఇలా పారిపోయాడంటూ అలీ రెజాపై యాంకర్ రవి అలిగాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది. ఇలా వెరైటీ వీడియోలతో యాంకర్ రవి తన యూట్యూబ్ ఆదాయాన్ని బాగానే పెంచేసుకుంటున్నాడు.
Recommended Video
అలా ముచ్చట్లు..
అయితే నేను డీజిల్ కోసం 4300 కట్టింది ఎవరికీ కనిపించడం లేదు.. కానీ ఆ 700 కట్టలేదని అలా అంటున్నారు.. వాడి మీద ఎందుకు అంత సింపతీ అంటూ అలీ రెజా ప్రశ్నించాడు. వాడే పెద్ద పిసినారి అంటూ అలీ రెజా కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ ఇద్దరూ చేసుకుంటున్న ఆరోపణలు మాత్రం బాగానే క్లిక్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











