ఉదయం మొదలుపెట్టి రాత్రి ముగించాం.. పెళ్లి రోజున యాంకర్ రవి స్పెషల్ సర్ప్రైజ్

యాంకర్ రవి తన ఫ్యామిలీ విషయాలను ఆ మధ్య ఎంత సీక్రెట్‌గా ఉంచేవాడో.. ఇప్పుడు అంత పబ్లిక్ చేస్తేస్తున్నాడు. యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్‌లో ఫ్యామిలీతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పాప వియాతో, భార్య నిత్య సక్సేనాతో రవి చేసే వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అలా లాక్డౌన్‌లో యూట్యూబ్ చానెల్‌ను బాగానే ఫేమస్ చేసుకున్నాడు. తాజాగా రవి తన వివాహా దినోత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఓ వీడియోను చేశాడు. తమ మధ్య ఉన్న బంధాన్ని తెలిపేలా వీడియోను రిలీజ్ చేశాడు.

కవర్ సాంగ్స్ ఫేమస్..

కవర్ సాంగ్స్ ఫేమస్..

ఈ మధ్య కవర్ సాంగ్స్ అంటూ హిట్ అయిన పాటలను తెగ వాడేస్తున్నారు. తమ స్టైల్లో ఆ పాటలకు వీడియోలు చేస్తూ వదులుతున్నారు. ఇలాంటి మరీ ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్లలో వాడుతుంటారు. అయితే రవి కూడా అలాంటి ఓ కవర్ సాంగ్ చేశాడు. రాహు సినిమాలోని ఏమో ఏమో ఏమో అనే పాటకు తన భార్యతో కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేశాడు.

ప్రోమోలతో రచ్చ..

ప్రోమోలతో రచ్చ..

యాంకర్ రవి నిత్యా సక్సెనా తమ ఎనిమిదో వివాహా వార్షికోత్సవాన్ని స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ కవర్ సాంగ్ చేసేందుకు మంచి లొకేషన్లను దొరకబట్టారు. ఉన్నంతలో చాలా రిచ్‌గా తీశారు. కాస్ట్‌లీ బైక్, క్యాస్టూమ్స్ ఇలా అన్ని బాగా కుదిరాయి. ఇక ఈ సాంగ్‌పై హైప్ క్రియేట్ చేసేందుకు ప్రోమోలు కూడా వదిలాడు.

తాజాగా అలా..

తాజాగా అలా..

రవి తాజాగా పూర్తి పాటను తన యూట్యూబ్ చానెల్‌లో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ పాట బాగానే క్లిక్ అవుతోంది. పెట్టిన క్షణాల్లోనే బాగా రీచ్ వచ్చింది. వ్యూస్ బాగానే వస్తున్నాయి. అయితే ఈ పాట వెనకాల ఉన్న కష్టాన్ని రవి వివరించాడు. ఈ పాట వెనకలా ఎవరెవరి కష్టం ఉండో కూడా చెప్పాడు.

Recommended Video

Corona Birth Anniversary: కరోనాను భయపెట్టేసిన రవిబాబు... Ravi Babu Reacts
ఉదయం నుంచి రాత్రి వరకు

ఉదయం నుంచి రాత్రి వరకు

వాట్టే ఎక్స్‌పీరియన్స్.. ఉదయం ఆరుగంటలకు మొదలుపెట్టిన షూటింగ్ రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది. రాజేష్ రచ్చ కెమెరామెన్, ఫాల్గూణి కొరియోగ్రఫీ చేసిందని చెప్పుకొచ్చాడు. ఐశ్వర్యా మేకప్ వేసిందని ఈ అందరి సహకారంతోనే ఒక్క రోజులో షూట్ చేసేశాం.. అద్భుతమైన అవుట్ పుట్ వచ్చిందని అన్నాడు. ముఖ్యంగా మధుర శ్రీధర్‌కు థ్యాంక్స్.. మీ అందరి ప్రేమ, సహకారాలే నాకు బలాన్ని ఇస్తాయి.. మీరు చూపించే ప్రేమకు థాంక్స్ అని రవి పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X