యాంకర్ రవి-అభిజిత్ బంధువులు.. వారి రిలేషన్ ఇదే.. బయటపెట్టిన వర్షిణి
యాంకర్ రవి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ చానెల్ పెట్టి దాన్ని బాగానే పాపులర్ చేసేశాడు. భార్య నిత్య, కూతురు వియాతో కలిసి యూట్యూబ్‌లో రచ్చ చేస్తుంటాడు. వియాతో ఆడుకునే వీడియోలు, భార్య నిత్యతో కలిసి చేసే షాపింగ్ ఇలా ఏదో ఒక కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటాడు. అవి బాగానే పాపులర్ అవుతున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌ను కొల్లగొడుతున్నాయి. తాజాగా రవి దీపావళి స్పెషల్‌గా ఓ ఇంటర్వ్యూ చేశాడు.

మొదటిసారిగా..
యాంకర్ వర్షిణి ఈ మధ్యే అలీతో సరదాగా షోలో తన ఫ్యామిలీ గురించిచెప్పింది. తనకు ఓ అక్క ఓ అన్నయ్య ఉన్నాడని తెలిపింది. అక్కకు మ్యారేజ్ అయిందని, అన్నయ్యకు ఇంకా కాలేదని తెలిపింది. అయితే వర్షిణి సోదరి ఇంత వరకు బయటి వారికి తెలియదు. బయట ఇంటర్వ్యూల్లోనూ ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారిగా యాంకర్ రవి ఇంటర్వ్యూలోనే దర్శనమిచ్చింది.

టాప్ 5 లిస్ట్..
ఈ ఇంటర్య్వూలో అనేక విషయాలు మాట్లాడుతూ బిగ్ బాస్ టాపిక్‌పై చర్చించారు. టాప్ 5లో ఎవరు ఉంటారు.. ఉండొచ్చని ఊహించారు. వర్షిణి ప్రకారం అభిజిత్, అరియానా, అవినాష్, లాస్య, సోహెల్ అని టాప్ 5 లిస్ట్‌ను చెప్పింది. అయితే ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరని అడిగితే మాత్రం అభిజిత్ అనిచెప్పేసింది.

పెళ్లి గోల..
అయితే వర్షిణి అలా చెప్పడం వెనుక కూడా కొన్ని కారణాలున్నాయి. అభిజిత్ వర్షిణి కలిసి పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌ను చేశారు. అది విపరీతంగా వైరల్ అయింది. అది సక్సెస్ అవ్వడంతోనే వర్షిణి బాగా పాపులర్ అయింది. అక్కడి పరిచయంతోనే అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్ అని చెప్పి ఉంటుంది.
సోదరికి కూడా..
నాకే కాదు మా అక్కకి కూడా అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్ అని వర్షిణి చెప్పింది. అంతే కాకుండా అభిజిత్ రవి బంధువులు అనే విషయాన్ని కూడా చెప్పేసింది. ఇద్దరూ రిలేటివ్స్ అవుతారని తన అక్కతో చెప్పేసింది. అవును నాకు కజిన్ బ్రదర్ అవుతాడంటూ యాంకర్ రవి అసలు సంగతి చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











