నా దగ్గర చాలా ఉన్నాయ్ అనుకుంటారు.. కానీ అది నిజం కాదు.. సుమ కామెంట్స్
యాంకర్ సుమ సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. సుమ చేసే పోస్ట్‌లు ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఎలాంటి మెసెజ్ ఇచ్చినా కూడా సరదాగానే ఇస్తుంటుంది. కానీ అందులో ఎంతో సీరియస్‌నెస్ కూడా ఉంటుంది. కానీ సీరియస్‌గా చెబితే ఎవ్వరూ వినరు. అందుకే వాటికి కూడా తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తూనే చెబుతుంటుంది. సోషల్ మీడియాలో సుమ యాక్టివ్ అయ్యాక పర్సనల్ విషయాలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.
Recommended Video

లాక్డౌన్ నుంచి అలా..
లాక్డౌన్ నుంచి సుమ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇంట్లో వంటలు చేసుకుంటూ.. ఇంటి పనులు చేసుకుంటూ.. ఖాళీగా ఉంటే జోరోను ఎలా హింసిస్తుందో చూపిస్తూ ఎన్నో వీడియోలను షేర్ చేసింది. అలా సుమ మొదటిసారిగా తన వ్యక్తిగత విషయాలను అంత బహిరంగంగా పంచుకోవడం ప్రారంభించింది.

అవగాహన కల్పించే వీడియోలు..
ఇక కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ నిబంధనలపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా సందేశాన్ని ఇచ్చేలా చేసే వీడియోల్లోనూ సుమ తన ముద్రను వేసుకుంది. కామెడీ చేస్తూనే మెసెజ్ ఇస్తూ వచ్చింది. అలా పూలు అమ్ముకునే చోట, లిఫ్ట్‌లో, సెట్‌లో ప్రతీ చోటా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై అవగాహన కల్పించింది.

ఫుల్ బిజీగా..
సుమ ఇటు బుల్లితెర షోలు, అటు వెండితెరకు సంబంధించిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఫుల్ బిజీగా ఉంటోంది. అన్నీ చానెల్స్‌లో సుమ ప్రోగ్రాంలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటి సుమకు రోజుకు ఐదారు సార్లు క్యాస్టూమ్స్ మార్చాల్సి వస్తుంటుంది. తన మేకప్ టీం వల్లే అన్ని పనులు సవ్యంగా చేయగలుగుతున్నానని సుమ చెప్పకొచ్చింది.

మేకప్ మెన్స్ వీడియో..
సుమకు రోజూ కనీసం నాలుగైదు షూటింగ్‌లుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మాత్రం మరింత పని ఎక్కువగా ఉంటుంది. అలా ఎంత పని ఉన్నా కూడా తన మేకప్, స్టైలీష్ట్, తన స్టాఫ్ ఎంతో పకడ్బందీగా ఉంటారు. వారంతా తమ తమ పనులు సక్రమంగా చేస్తారు కాబట్టే తాను ఇన్ని పనులు చేయగలుగుతున్నానని చెప్పుకొచ్చింది.

తాజాగా ఇలా..
అయితే సుమ ఇంత బిజీగా ఉంటూ ఇన్ని క్యాస్టూమ్స్, చీరలు ధరిస్తుంటుంది. అలాంటి సుమకు ఎన్నో చీరలుంటాయని అందరూ అనుకుంటారు. ఇంకా షాపింగ్ కూడా ఎక్కువే చేస్తుందని భావిస్తారు. కానీ అవన్నీ నిజం కాదట. తాజాగా ఇదే విషయాన్ని సుమ చెప్పుకొచ్చింది. ప్రతీ ఏడాది తన బర్త్ డేకు తన తండ్రి ఓ చీరను కొంటాడట.. మిగతా వారు ఒకటో రెండు ఇస్తారట. నాకు చాలా చీరలుంటాయని మీరనుకుంటారు.. కానీ అది నిజం కాదు.. అందుకే నాకు షాపింగ్ కూడా చేయాలన్న ఆసక్తి ఉండదని సుమ ఫన్నీ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











