ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్

ఒక్కోసారి సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్లు వస్తుంటాయో ఊహించడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీలుపెట్టే పోస్ట్‌లపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. అందులోనూ అనసూయ వంటి కొంత మంది పెట్టే వారి పోస్ట్‌ల కింద దాదాపు అన్నీ కూడా నెగెటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి. అలా మొదటిసారిగా యాంకర్ సుమ పెట్టిన ఓ పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. మామూలుగా సుమ చేసే పోస్ట్‌లకు అన్నీ పాజిటివ్ కామెంట్లే వస్తుంటాయి. కానీ ఈ కొత్త పోస్ట్ మాత్రం ట్రోలింగ్‌కు గురవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..


బుల్లితెరపై, సినిమా ఈవెంట్లలో సుమ ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలు సుమ ఉంటేనే సందడి వాతావరణం వస్తుంది. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోల ఈవెంట్లన్నీ కూడా సుమ హోస్ట్ చేస్తుంటుంది. అలా తెరపైనే కాదు తెర వెనుక కూడా తాను అంతే సరదాగా ఉంటానని చెబుతూ సోషల్ మీడియాలో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ఫన్నీవీడియోలు..

ఫన్నీవీడియోలు..

సుమ మామూలుగా సందేశాత్మక పోస్ట్‌లు ఏమీ పెట్టదు. మెసెజ్ ఇచ్చినా కూడా ఫన్నీగానే చెబుతుంది. మాస్క్‌లు ధరించండి.. దూరాన్ని పాటించండి.. అంటూ కోవిడ్ నిబంధనలను కూడా సరదాగా వీడియోలు చేస్తూ అందరికీ అవగాహన కలిగిస్తూ వస్తుంది. అలాంటి సుమ ఓ పోస్ట్ చేసింది.

విద్యార్థి కోసం టీచర్..

విద్యార్థి కోసం టీచర్..

ఓ విద్యార్థికి ఆపరేషన్ చేయాలని, డబ్బులు విరాళంగా ఇవ్వాలని ఓ టీచర్ చేస్తున్న కార్యక్రమానికి సుమ అండగా నిలిచింది. విద్యార్థుల కోసం అండగా నిలబడే టీచర్లు తనకు తెలుసని.. అలా ఈ టీచర్‌కు తాను అండగా ఉంటానని వీలైతే సాయం చేయండని, విరాళాలు ఇవ్వండని సుమ కోరింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 16 Highlights,అరియానా Vs సోహైల్..కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు!
నెగెటివ్ కామెంట్స్..

నెగెటివ్ కామెంట్స్..

తాను సాయం చేస్తున్నాను.. మీరు కూడా అలా ఫీలైతే సాయం చేయవచ్చని సుమ చెప్పుకొచ్చింది. అయినా కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్లు చేశారు. మీ ఒక్క ఈవెంట్ రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు కదా.. క్యాష్ షోలో వచ్చే సెలెబ్రిటీలు, గెలిచే డబ్బులు ఇవ్వమని అడగొచ్చు కదా అని కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X