twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది మా అమ్మ కోరిక.. నాటి రోజులను గుర్తు చేసుకున్న యాంకర్ సుమ

    |

    ఒకప్పుడు యాంకర్ అంటే కేవలం గలగల మాట్లాడితే చాలు.. స్పష్టమైన వాక్పటిమ ఉంటే చాలు.. తెలుగుపై కాసింత పట్టు ఉంటే చాలు అనుకునే వారు. కానీ ఇప్పుడు యాంకర్ అంటే మాత్రం అన్ని రకాల పనులు చేయాల్సి వస్తుంది. యాంకర్ అంటే పిచ్చిపిచ్చి స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇవ్వాల్సిందే. రాకపోయినా పాటలు, పాటలకు స్టెప్పులు వేయాల్సిందే..గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాల్సిందే. చివరకు సుమ కూడా గెంతులు వేస్తూనే ఎంట్రీ ఇచ్చే వరకు వచ్చింది.

     బుల్లితెరపై అలా..

    బుల్లితెరపై అలా..

    సుమకు బుల్లితెరపై తిరుగేలేదు. వ్యాఖ్యాతగా, తెలుగును అంత సుస్పష్టంగా పలకగల అంతటి వాక్పటిమ సుమకు మాత్రమే ఉంది. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా.. ఎంత మంది గ్లామర్‌తో ఆకట్టుకుని యాంకర్లుగా సెటిల్ అవుదామని చూసినా కూడా సుమ స్థానాన్ని ఇంచు కూడా కదల్చలేకపోయారు.

     డ్యాన్సులు మాత్రం..

    డ్యాన్సులు మాత్రం..

    అయితే ఇప్పుడు మారిన ట్రెండ్ ప్రకారం.. యాంకర్లకు కూడా డ్యాన్సులు రావాలి.. అన్ని రకాల ఫీట్లు వచ్చి ఉండాలనేట్టుగా మారింది. కానీ సుమకు అంతగా డ్యాన్స్ రాదు. ఏదో మ్యానేజ్ చేస్తుంటుంది. వచ్చిన ఐదారు మూమెంట్స్‌నే అన్ని షోల్లోనూ వాడేస్తూ ఉంటుంది. అయితే సుమకు డ్యాన్స్ రాదని అంతా అనుకుంటారు.

     చిన్నతనంలో అలా..

    చిన్నతనంలో అలా..

    అయితే సుమకు చిన్నతనంలో సంప్రదాయ నృత్యంలో ప్రావీణ్యం ఉందన్న సంగతి తాజాగా బయటపెట్టేసింది. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్‌లొ శిక్షణ తీసుకున్నానే విషయాన్ని ఇప్పుడు చెప్పేసింది. అంతే కాకుండా ఆ సమయంలో దిగిన ఫోటోను తాజాగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

    అమ్మ కోరిక..

    అమ్మ కోరిక..

    మా అమ్మకు డ్యాన్స్ అంటే ఎంతో ప్రాణం.. నేను డ్యాన్స్ నేర్చుకోవాలని ఆమె ఎంతగానో ఆశ పడేది.. పైగా నాక్కూడా డ్యాన్స్ చేయడం అంటే ఇష్టమే.. శ్రీమతి బాద్రా నాకు గురువు. నా స్కూల్ డేస్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్‌ నాటి ఫోటో ఇది అంటూ సుమ చెప్పుకొచ్చింది.

    బిజిబిజీగా..

    బిజిబిజీగా..

    ప్రస్తుతం సుమ బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్న ఆర్టిస్ట్, యాంకర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఇలా ప్రతీ చానెల్‌లో సుమ ఓ స్పెషల్ షో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. సుమ లేకపోతే పెద్ద పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగనే జరగవు.

    English summary
    Anchor Suma Anout Her Mother Dream And Classic Dance
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X