twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్దరాత్రి కూడా వదిలపెట్టడం లేదు.. వాళ్లకే ఎందుకు అలా.. యాంకర్ సుమ రచ్చ!!

    |

    యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎంత హల్చల్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత వరకు సుమను తెరపైన మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తెరపై క్రియేట్ చేసే ఫన్ కంటే వంద రెట్లు ఎక్కువగా సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తోంది. సుమ నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటుంది.

    కొన్నింట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటే.. మరికొన్నింట్లో సామాజిక స్పృహ ఉంటుంది. ఇలా వీడియోలతో సుమ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా సుమ అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా కూర్చుని ఉంది. అలా ఎందుకు ఉందో చెబుతూ అసలు గుట్టు విప్పింది.

    సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    యాంకర్ సుమ సోషల్ మీడియాలో వీడియోలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. అవి మాస్కులు ధరించమని వార్నింగ్‌‌లు ఇచ్చినా సరే, తన పెట్ జోరోతో కలిసి ఆడిన ఆటలైనా సరే, ఇంట్లో వంటలు చేస్తూ బోళ్లు కడుగుతూ వేసిన స్టెప్పులైనా సరే సుమ షేర్ చేసే వీడియాలో నెటిజన్లలో ఉత్సాహాన్ని నింపుతాయి. సోషల్ మీడియాలోనూ సుమ అంతే ఫన్నీగా సరదాగా ఉండటంతో ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు.

    కొత్త షోలు..

    కొత్త షోలు..

    లాక్డౌన్ వల్ల సుమ కొత్త కొత్త షోలను కూడా ప్రారంభించేసింది. యూట్యూబ్‌లో సుమక్క పేరిట రచ్చ రచ్చ చేస్తోంది. ఈట్ విత్ టాక్ అనే కొత్త షోను పెట్టి.. అతిథులను తీసుకొస్తుంది. వారి చేత ఏదో ఒక వంటను ప్రిపేర్ చేయిస్తోంది. మొత్తానికి ఆ షో కూడా బాగానే క్లిక్ అయింది. ఇక తాజాగా మరో షో కోసం రెడీ అయింది. అది కూడా అర్దరాత్రిలో మేకప్ వేసుకుని కూర్చుంది.

    అమెరికాలోని మనవారి కోసం..

    అమెరికాలోని మనవారి కోసం..

    తాజాగా సుమ అమెరికాలోని తెలుగు వారి కోసం లక్కీ మహిళ అనే షోను హోస్ట్ చేసింది. ప్రతీ ఏడాది ఈ షోను నిర్వహిస్తామని సుమ పేర్కొంది. అందుకే ఈ అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీ అయ్యాయని అసలు విషయం చెప్పింది. అయితే ప్రతీ సారి కంటే ఈ సారి ఓ గంట ఆలస్యంగా మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
    ఎందుకలా?

    ఎందుకలా?


    అయితే ప్రతీసారి ఈ షోను రాత్రి పది గంటల 30 నిమిషాలకు ప్రారంభించేవారట. కానీ ఈ సారి అమెరికాలో ఓ గంట ముందు ఉందట. అందుకే షూటింగ్ గంట ఆలస్యంగా ప్రారంభం కానుందని తెలిపింది. అమెరికా వాళ్లకే గంట ముందుకు ఎందుకు వెళ్లింది.. మన టైం అలాగే ఉంది కదా? అదెలా అంటూ సుమ బేతాళ ప్రశ్నలను సంధించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    English summary
    Anchor Suma Busy With Shoot At Midnight For US Show, Time paaaaassssssss just before time starts because time in usa moved 1hour sideways..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X