సుమ కాళ్లు మొక్కిన రానా.. సాష్టాంగ నమస్కారం చేయడంతో షాక్

Recommended Video

Rana Daggubati Hilarious Act With Anchor Suma At Jersey Success Meet || Filmibeat Telugu

ఫంక్షన్ ఏదైనా యాంకర్ సుమ తనదైన శైలిలో దడదడలాడించేస్తుంటారు. వేదికపై నుంచి ఆడియెన్స్‌నే కాదు.. టీవీ, యూట్యూబ్‌లో కార్యక్రమాన్ని చూసే వీక్షకులు ఆమె మాటలకు ఫిదా అవుతుంటారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో సుమ ప్రతిభ ఏదో రకంగా బయటపడుతూనే ఉంది. అంతేకాకుండా స్టేజీ మీద నటీనటులను ఆటపట్టించడంలో సుమ శైలికి ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా జెర్సీ సినిమా థ్యాంక్యూ మీట్‌లో ఓ సరదా సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఇంతకు ఏం జరిగిందంటే

నాకు పెళ్లి, పిల్లలు అంటే

నాకు పెళ్లి, పిల్లలు అంటే

జెర్సీ సినిమా థాంక్యూ మీట్‌లో రానా మాట్లాడుతూ... జెర్సీ సినిమా యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా నాకు అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు, క్రికెట్ లాంటి అంశాలు నాకు పట్టవు అని రానా కామెంట్ చేశారు. అయితే సినిమా నాకు కంటతడి పెట్టించింది. ఇక ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని రానా అన్నారు.

 సుమ కాళ్లపై పడిన రానా

సుమ కాళ్లపై పడిన రానా

అయితే రానా వ్యాఖ్యలపై సుమ స్పందించారు. జెర్సీ థాంక్యూ మీట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లల గురించి అంతా అర్థం కావాలని కోరుకొంటున్నాను అని సుమ అనగానే.. రానా వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. అంతేకాకుండా కాళ్లు మొక్కే ప్రయత్నం చేయడంతో సుమ కంగారు పడింది. వెంటనే కాళ్లు వెనక్కు లాగే ప్రయత్నం చేశారు.

మీరు ఎందుకు సుఖంగా ఉండాలి

మీరు ఎందుకు సుఖంగా ఉండాలి

సుమకు కాళ్లు మొక్కి రానా వెళ్లిపోతుంటే మళ్లీ ఆయనను ఉడికించే ప్రయత్నం సుమ చేశారు. అందరూ పెళ్లి చేసుకొని కష్టాలు పడుతుంటే.. మీరు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి. మీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకొని పిల్లలు కనాలని, అమ్మాయిల మనసును అర్ధం చేసుకోవాలి అన్నట్టు మాటలు విసిరారు.

 ట్రెండింగ్‌గా రానా, సుమ ఫన్నీ ఎపిసోడ్

ట్రెండింగ్‌గా రానా, సుమ ఫన్నీ ఎపిసోడ్

యాంకర్ సుమ, రానా మధ్య వేదికపై చోటుచేసుకొన్న సన్నివేశం ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఏది ఏమైనా రానా, సుమ మాటల విసుర్లు కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఈ కార్యక్రమంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్ కమ్రా తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X