ఫ్లాష్ బ్యాక్ : అభిమాని అలా అన్నాడట.. అప్పటి నుంచి పూర్తిగా మానేసిన యాంకర్ సుమ
తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని ఒకే ఒక్క పేరు సుమ. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ సుమక్కగా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అవతల ఎంతటి వారున్నా సరే సుమక్క అని అనాల్సిందే. యాంకరింగ్‌లో శిఖరాగ్రానికి చేరుకున్న సుమ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
గ్లామర్‌తో యాంకరింగ్ దూసుకుపోవాలని ఎంతో మంది వచ్చినా సుమను మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ సుమ నెంబర్ వన్ యాంకర్ అని నిస్సందేహంగా ఒప్పుకుంటారు. అలాంటి సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంది వీరాభిమానులున్నారు.

బుల్లితెర రాణి..
బుల్లితెరపై సుమ సృష్టించినన్న రికార్డులు మరెవ్వరూ సృష్టించలేకపోయారు. మహిళా లోకం కోసం ప్రత్యేకంగా స్టార్ మహిళ అనే కార్యక్రమాన్ని సుధీర్ఘంగా నడిపి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇలా బుల్లితెరపై అశేష అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమ.. తెలుగింటి ఆడపిల్లలా మారిపోయింది.

సోషల్ మీడియాలోనూ..
బుల్లితెర, వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ సుమ హల్చల్ చేస్తూ ఉంటోంది. ఈ మధ్య యూట్యూబ్‌లో సుమక్క అనే ఛానెల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తన ఫాలోవర్స్‌ను తెగ నవ్విస్తోంది. చాలా తక్కువ సమయంలో సుమక్క యూట్యూబ్ ఛానెల్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

నాటి ఓ ఘటన..
తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమకు ఓ సంఘటన ఎదురైందట. ఓ అభిమాని అన్న మాటలకు అప్పటి నుంచి తన పద్దతిని మార్చుకుందట. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో సుమ చెప్పుకొచ్చింది. అలాంటి అభిమానులు ఉంటారా? అని అనుకుని ఎమోషన్ అయిందట.
Recommended Video

అభిమాని మాటతో..
సుమ ఓ సారి చేపల మార్కెట్‌కు వెళ్లిందంటా. అయితే అక్కడ ఓ అభిమాని సుమతో ఇలా అన్నాడట.. ‘మిమ్మల్ని చూస్తే మా బ్రాహ్మణుల పిల్లలా అనిపిస్తావమ్మా.. చేపలు తింటే తిను గానీ.. కొనడానికి మాత్రం ఇలా రాకమ్మా' అని ఎంతో ఆప్యాయంగా అన్నాడట. దీంతో ఇంత ప్రేమను చూపించే అభిమానులు కూడా ఉంటారా? అని అప్పటి నుంచి అటు వైపు వెళ్లడమే మానేసిందంటా.


Click it and Unblock the Notifications











