twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను నీలో ఏకమై ఉన్నాను లవ్యూ.. మై డియర్ రాజా అంటూ భర్తపై ప్రేమను కురిపించిన సుమ

    |

    యాంకర్ సుమ, రాజీవ్ కనకాల బంధం మీద ఎన్ని రకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇద్దరూ విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని అందుకే వేర్వేరుగా ఉంటున్నారని కథలు కథలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిపై ఏనాడూ కూడా బయటకు వచ్చి స్పందించడం గానీ ఖండించడం గానీ చేయలేదు. కానీ ఈ మధ్య మాత్రం వీటిపై పరోక్షంగా స్పందిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ యాక్టివ్‌గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా సుమ ఈ మధ్య రాజీవ్ కనకాల గురించి ఎక్కువగా చెబుతోంది.

     సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    సుమ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ హల్చల్ చేస్తోంది. రాజీవ్ కనకాలతో కలిసి దిగిన సెల్ఫీలు, వీడియోలను షేర్ చేస్తూ తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని పరోక్షంగా చెబుతోంది. ఈ మధ్యే ఈ ఇద్దరూ కలిసి తమ వారసుడ్ని సినీ రంగ ప్రవేశం చేయిస్తున్నారు.

    పూజా కార్యక్రమాలు..

    పూజా కార్యక్రమాలు..

    సుమ, రాజీవ్ తమ వారసుడు రోషన్‌ను హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు, కెరీర్‌ను నిలబెట్టేందుకు ఇలా కలిసిపోయారని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు కూడా చేశారు.

    దసరా సెలెబ్రేషన్స్..

    దసరా సెలెబ్రేషన్స్..

    దసరా పండుగ సందర్బంగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. సుమ, రాజీవ్ కలిసి తమ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలను తెలిపారు. దసరాకు ఈ జంట వెకేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. నేడు (నవంబర్ 13) రాజీవ్ కనకాల బర్త్ డే. ఈ సందర్భంగా సుమ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    Recommended Video

    Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
    మై డియర్ రాజా..

    మై డియర్ రాజా..

    రాజీవ్ కనకాలతో దిగిన ఫోటోను సుమ షేర్ చేస్తూ.. మై డియరెస్ట్ రాజా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నువ్వే నా బలం.. నువ్వే నా సంతోషం.. నీతో ఉండటం నాకో వరం.. నీతో ఉన్న ప్రతీ రోజూ ఏదో కొత్తగా అనిపిస్తుంది.. లవ్యూ.. నీలో నేను మమైకమై ఉన్నాను.. మై డియర్ అంటూ పోస్ట్ చేసింది.

    English summary
    Anchor Suma Showers Love On Rajeev Kanakala On His Birthday, My dearest raja a very very very happy birthday to you . You are my strength and happiness, I am blessed to be with you , I look forward to everyday as a new day to be with you . Love uuuuuu , I am in oneness with you my dear
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X