సుధీర్ క్రేజ్ మామూలుగా లేదు.. అదంతే ఆయన వల్లే సాధ్యం.. సుమకు తలనొప్పిగా మారనుందా?
యాంకర్ సుమ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ ఇలా తేడా లేకుండా అన్నింటా దుమ్ములేపుతోంది. ఇక యూట్యూబ్ సుమక్క పేరిట చేసే వీడియాలు, స్పెషల్ ప్రోగ్రాంలు బాగానే క్లిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈట్ టాక్ అంటూ సుమ చేసిన ప్రోగ్రాం బాగా వైరల్ అయింది. ఇందులో శ్రీముఖి, సుధీర్, ప్రదీప్, రేణూ దేశాయ్ ఇలా ఎంతో మంది సెలెబ్రిటీలను తీసుకొచ్చింది.

అలా కొత్తగా.
.
ఈట్ టాక్ షో గురించి అందరూ ఏమనుకుంటున్నారు.. ఎలాంటి కామెంట్లు పెడుతున్నారో నేను చేస్తున్నాను. కానీ ఈ మధ్య ఎక్కువగా కామెంట్లను చదవడం లేదు. అందుకే ఈ సారి ఈ వీడియో మొత్తం కామెంట్లకు అంకితం చేస్తాను. ఈట్ టాక్ షో గురించి నెటిజన్లు ఎలాంటి కామెంట్లు చేశారో చదివి తెలుసుకుందాం అంటూ సుమ ఓ వీడియోను షేర్ చేసింది.

శ్రీముఖి వీడియోపై..
శ్రీముఖితో సుమ చేసిన ఈట్ టాక్ షోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఆ చేసిన వంటకం బాగానే ఉంది.. తయారు చేసుకునే విధానం కూడా చెబితే బాగుండేది కదా? అని కామెంట్లు పెట్టారట. దానికి సుమ సమాధానం చెప్పింది. మనది మొత్తం వంటల ప్రోగ్రాం కాదు కదా? అయినా మీకు ఇలాంటి థాట్స్ రావాలనే అలా చేశామంటూ కవర్ చేసింది.

తెనాలి డబుల్ హార్స్..
ఇక సుమ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సుమ తన షోలో తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు వాడకుండా వేరే ప్రొడక్ట్ వాడటంపైనా సెటైర్ వేశాడు. మాకేమో అది వాడమని చెబుతున్నారు మీరేమో ఓట్స్ వాడుతున్నారంటూ కామెంట్ చేశారు.

సుధీర్ వీడియోపై..
సుధీర్‌తో చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో కింద నెటిజన్లు పెట్టిన కామెంట్లు చదివింది. అందులో ఓ నెటిజన్ సుధీర్ క్రేజ్ గురించి చెప్పాడు. సుధీర్ ఉండటం వల్లే ఈ వీడియో అంత త్వరగా రెండు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.. కింద మీద ఊపు మా సుధీర్ అన్న తోపు అంటూ కామెంట్ పెట్టాడు.
Recommended Video

సుధీర్ అన్న తోపు..
ఆ కామెంట్‌ను చదివిన సుమ అవును నిజమే అంటూ వత్తాసు పలికింది. ఇంత తక్కువ సమయంలో రెండు మిలియన్ల వ్యూస్ అంటే అది సుధీర్ వల్లే..నిజంగానే సుధీర్ అన్నతోపు అంటూ సుమ కూడా జై కొట్టాల్సి వచ్చింది. ఇలా సుమ పక్కన ఉండగానే సుధీర్ క్రేజ్ గురించి సపరేట్‌గా మాట్లాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











