Anchor Suma రేంజ్ మామూలుగా లేదుగా.. సుమ చేతుల మీదుగా మనోహరి కలెక్షన్లు!
తెలుగు వినోదరంగం, టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ అంటే తెలియని వారుండరు. సొంతంగా షోలు చేస్తూ.. ప్రైవేట్ ఈవెంట్లకు హోస్ట్‌గా, యాంకర్‌గా రాణిస్తున్నారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్‌ను అందుకొనే ఏకైక యాంకర్‌గా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ ఫ్యాషన్ బోటిక్‌ను ప్రారంభించిన ఘనతను సుమ అందుకొన్నారు. యాంకర్ సుమ ప్రారంభించిన బోటిక్ వివరాల్లోకి వెళితే..
ఐటీ రంగమే కాకుండా ఫ్యాషన్ రంగం హైదరాబాద్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్లోబల్ ఫ్యాషన్స్‌ను పట్టుకొంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొంటున్నది. మహిళలను ఆలరించే ఫ్యాషన్ సంస్థలు హైదరాబాద్‌లో లెక్కలేనప్పటికీ వైవిధ్యాన్ని చూపే సంస్థలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి డిఫరెంట్ తాజాగా జ్యూబ్లిహిల్స్‌లో గ్జితి (XITI) వేవ్స్ అనే ఫ్యాషన్ సంస్థ స్టైల్ ఆశించే ప్రియులను ఆకట్టుకొనేందుకు సిద్దమైంది. గ్జితి (XITI )లో మనోహరి పేరుతో కొత్త కలెక్షన్స్‌ను యాంకర్ సుమ ప్రారంభించారు.

గ్జితి (XITI) ఫ్యాషన్ షో రూమ్‌లో ఉన్న కలెక్షన్స్ పరిశీలించి యాంకర్ సుమ అవాక్కయ్యారు. గ్జితి (XITI) వేవ్స్ ఉన్న డిజైన్స్ కి ముచ్చట చెందారు. ఈ సందర్బంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.. గ్జితి (XITI) ఫ్యాషన్ షోరూమ్‌లో కలెక్షన్లు చాలా బాగున్నాయి. ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ చేస్తే గొప్ప అనుభూతిని పొందడం ఖాయం. ఊహించని కలెక్షన్లు ఉండటం చాలా ఆనందంగా ఉంది అని యాంకర్ సుమ తెలిపారు.
గ్జితి (XITI) వేవ్ నిర్వాహకురాలు సౌజన్య మంచి అభిరుచి ఉన్న ఫ్యాషన్ ప్రియులుగా కనిపించారు. ఆమె షో రూమ్‌లో ఉంచిన డిజైన్స్ చాలా బాగున్నాయి. ప్రతీ ఒక్కరికి నచ్చే విధంగా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌లో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్బంగా నేను ధరించిన చీర ఇక్కడ తీసుకొన్నదే. నా అభిరుచికి తగిన చీరెల, ఇతర ఫ్యాషన్ డిజైన్లు ఉన్నాయి. తప్పకుండా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొంటుందని అనుకొంటున్నాను అని యాంకర్ సుమ అన్నారు.

గ్జితి (XITI) వేవ్ నిర్వాహకురాలు సౌజన్య మాట్లాడుతూ.. గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్స్‌లో హైదరాబాద్ పోటీ పడుతున్నది. పోటిని తట్టుకొనేందుకు గ్జితి (XITI) అన్ని రకాల ఫ్యాషన్ డిజైన్లు ఉన్నాయి. ఎక్ల్యూజివ్‌గా డిజైన్లను మహిళల ఏర్పాటు చేశాం. యాంకర్ సుమ మా కలెక్షన్లు ప్రారంభించడం ఆనందంగా ఉంది. మేము అందించే క్వాలిటీ, డిజైన్స్ మమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతాయనే నమ్మకం ఉంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











