రూటు మార్చిన యాంకర్ శ్యామల: మొన్న ఆయనతో.. నిన్న ఆమెతో భేటీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల ఆదరణతో స్టార్లు ఎదుగుతున్నారు. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ శ్యామల ఒకరు. చాలా కాలంగా తెలుగు టెలివిజన్ రంగంలో సందడి చేస్తోన్న ఈమె.. అన్నింట్లోనూ ఉంటూ హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో భాగంగానే రాజకీయాల్లోనూ యాక్టివ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సీనియర్ యాంకర్.. వైఎస్ షర్మిలతో సమావేశం అవడం చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళ్తే....

నటిగా పరిచయం.. యాంకర్‌గా పాపులర్

నటిగా పరిచయం.. యాంకర్‌గా పాపులర్

యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది శ్యామల. ఈ క్రమంలోనే ఎన్నో సీరియళ్లలో నటించింది. వాటిలో 'లయ', 'అభిషేకం' గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' కార్యక్రమాలతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వీటితో పాటు 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

బుల్లితెర నటుడితో లవ్... అలా వివాహం

బుల్లితెర నటుడితో లవ్... అలా వివాహం

వరుస సీరియళ్లు, సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలో బుల్లితెర నటుడు నరసింహాతో శ్యామల ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా ట్రాక్ నడిపింది. ఈ క్రమంలోనే తమ బంధం గురించి పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

బిగ్ బాస్‌లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చినా

బిగ్ బాస్‌లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చినా

మూడేళ్ల క్రితం జరిగిన బిగ్ బాస్ రెండో సీజన్‌లో శ్యామల కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏడాది బిడ్డ ఉన్నప్పటికీ.. కెరీర్‌ కోసం హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే, అనుకోని విధంగా ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ప్రేక్షకుల ఓట్లతో ఆ వెంటనే మరోసారి షోలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ ఆమె ఫినాలేకు కూడా చేరుకోలేకపోయింది. అయితేనే ఫేమస్ అయింది.

పొలిటికల్ ఎంట్రీ.. వైఎస్ జగన్ గెలుపులో

పొలిటికల్ ఎంట్రీ.. వైఎస్ జగన్ గెలుపులో

బిగ్ బాస్ షోలో గెలవకున్నా పేరు మాత్రం బాగానే సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు భర్తతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. తద్వారా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపులో భాగం అయ్యారు.

ఆయనతో సమావేశం.. కొత్త అనుమానం

ఆయనతో సమావేశం.. కొత్త అనుమానం

రెండేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్న శ్యామలకు.. ఏదైనా పదవి వస్తుందన్న టాక్ కూడా గట్టిగానే వినిపించింది. కానీ, అదేమీ జరగలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదు. దీంతో ఆఫర్ల కారణంగానే శ్యామల రాజకీయాలకు దూరంగా ఉందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రదర్ అనిల్‌ను కలవడం అనుమానాలు రేకెత్తించింది.

షర్మిల ఇంట్లో కనిపించి షాకిచ్చిన శ్యామల

షర్మిల ఇంట్లో కనిపించి షాకిచ్చిన శ్యామల

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలం కాబోతున్న విషయం తెలిసిందే. ఆమె ఓ పొలిటికల్ పార్టీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో తరచూ ఏదో ఒక జిల్లా నాయకులతో సమావేశం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ శ్యామల తన భర్త నరసింహాతో కలిసి లోటస్ పాండ్‌కు వెళ్లి మరీ షర్మిలను రహస్యంగా కలిశారు.

భర్తతో కలిసి.. ఆయనకు హ్యాండివ్వబోతుందా?

భర్తతో కలిసి.. ఆయనకు హ్యాండివ్వబోతుందా?

శ్యామల మొన్న బ్రదర్ అనిల్‌ను.. నిన్న వైఎస్ షర్మిలను కలవడంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె వైసీపీకి దూరం కాబోతుందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. అదే సమయంలో షర్మిల పెట్టబోయే పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ వార్తల కారణంగా శ్యామల మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X